• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • ELECTION COMMISSION POSTPONES BY ELECTIONS IN 3 LOK SABHA AND 8 ASSEMBLY CONSTITUENCIES AS COVID CASES RISE IN INDIA SK

Election Commission: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

కడప జిల్లాలోని బద్వేలులో వైసీపీ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మార్చిలో మరణించారు. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. ఈనేపథ్యంలో బద్వేలులో ఉపఎన్నిక అనివార్యమయింది.

  • Share this:
    ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఎన్నికల వల్లే అక్కడ కరోనా కేసులు పెరిగాయని విపక్షాలు మండిపడ్డాయి. ఐనప్పటికీ ఎన్నికల సంఘం మాత్రం అనుకున్న షెడ్యూల్‌కే ఎన్నికలను పూర్తిచేసింది. ఐతే ప్రస్తుతం కరోనా తీవ్రత పెరగడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుపడే వరకు ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు కారణాల వల్ల మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు జరగాల్సి ఉంది.

    కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్‌హవేలీ, మధ్యప్రదేశ్‌‌లోని ఖండ్వా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానాల్లో ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు ఏపీలోని బద్వేలు, హర్యానాలోని కల్కా, ఎలియాబాద్‌, రాజస్థాన్‌లోని వల్లభ్‌నగర్, కర్నాటకలోని సిండ్గి, మేఘాలయాలోని రాజబల, మారైంగ్‌కెంగ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ నియోవర్గాల్లో ఉప ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫై చేసింది. ఐతే ప్రస్తుతం మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికలను వాయిదా వేసింది ఈసీ.

    ఆయా రాష్ట్రాల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత పరిస్థితిపై సమీక్షించనున్నారు. ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా.. తగిన సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం వెల్లడించింది. కడప జిల్లాలోని బద్వేలులో వైసీపీ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మార్చిలో మరణించారు. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. ఈనేపథ్యంలో బద్వేలులో ఉపఎన్నిక అనివార్యమయింది. కాగా, ఇటీవలే ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తిరుపతిలో వైసీీపీ అభ్యర్థి గురుమూర్తి, నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ నేత నోముల భగత్ విజయం సాధించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: