హోమ్ /వార్తలు /National రాజకీయం /

Bihar: బిహార్​లో ఎల్​జేపీ రాజకీయ క్రీడకు ఎన్నికల కమిషన్​ షాక్​​.. పార్టీ గుర్తు స్తంభింపజేస్తూ నిర్ణయం

Bihar: బిహార్​లో ఎల్​జేపీ రాజకీయ క్రీడకు ఎన్నికల కమిషన్​ షాక్​​.. పార్టీ గుర్తు స్తంభింపజేస్తూ నిర్ణయం

పశుపతి కుమార్​ (Photo: ANI / Twitter)

పశుపతి కుమార్​ (Photo: ANI / Twitter)

ఇప్పటివరకు పంజాబ్​లో రాజకీయ చదరంగం నడిచింది. ఇక ఇపుడు బిహార్​లో నడుస్తోంది. అక్కడ లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎల్‌జేపీ గుర్తును స్తంభింపచేస్తూ ఎన్నికల కమిషన్ (Election commission) శనివారం నాడు నిర్ణయం తీసుకుంది. పార్టీలో వర్గపోరు కారణంగా ఈసీ (EC) తాత్కాలికంగా పార్టీ గుర్తు (Symbol)ను నిలిపివేసింది

ఇంకా చదవండి ...

బిహార్‌ (Bihar). రాజకీయ క్రీడలకు వేదికైన రాష్ట్రం. ఇప్పటివరకు పంజాబ్​లో రాజకీయ చదరంగం నడిచింది. ఇక ఇపుడు బిహార్​లో నడుస్తోంది. అక్కడ లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎల్‌జేపీ గుర్తును స్తంభింపచేస్తూ ఎన్నికల కమిషన్ (Election commission) శనివారం నాడు నిర్ణయం తీసుకుంది. పార్టీలో వర్గపోరు కారణంగా ఈసీ (EC) తాత్కాలికంగా పార్టీ గుర్తు (Symbol)ను నిలిపివేసింది (freezes). ఇదివరకే చిరాగ్ పాశ్వాన్ (chirag Paswan) వెంట ఉన్న ఎల్‌జేపీ (LJP) వర్గం గుర్తు తమదేనని చెబుతుంటే, పశుపతి కుమార్ పరాస్ (Pashupati Kumar paras) నేతృత్వంలోని ఎల్‌జేపీ నేతలు తమకు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. పార్టీలో వర్గ పోరు నేపథ్యంలో ఈసీ ఎల్‌జేపీ గుర్తును స్తంభింపజేయాలని నిర్ణయం తీసుకుంది. అధికారికంగా నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.

పార్టీ గుర్తు అయిన ఇల్లు (house) తమకే సొంతం కావాలని చిరాగ్ పాశ్వాన్ (chirag pashwan) వర్గం వాదిస్తోంది. మరోవైపు పశుపతి సారథ్యంలోని నేతలు గుర్తు (symbol) తమకు ఇవ్వాలని ఈసీకి విన్నించుకున్నారు. అక్టోబర్ 4వ తేదీలోపు.. వీలైతే శనివారం నాటికి ఈసీ తమ నిర్ణయాన్ని తీసుకుంటాయని చెప్పారు. ఎల్‌జేపీ గుర్తును స్తంభించపచేయాలని అధికారులు (officials) నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బిహార్‌లో 2 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలకు (By polls) నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్‌జేపీ వర్గపోరు ఈసీ వరకు వెళ్లింది.చిరాగ్ పాశ్వాన్, పశుపతి వర్గాల మధ్య సయోధ్య కుదరని పక్షంలో వీరు ఈసీని ఆశ్రయించారు. కానీ ఇటు చిరాగ్ వర్గానికి గానీ. అటు పశుపతి వర్గానికి గానీ ఎల్‌జేపీ గుర్తును కేటాయించకూడదని ఈసీ నిర్ణయించింది.

ఎల్జేపీ వర్గాల మధ్య గుర్తు విషయంలో తలెత్తిన వివాదంపై భారత ఎన్నికల కమిషన్ మూడు ఆప్షన్లు (three options) పరిశీలించిదని తెలుస్తోంది. తుది నిర్ణయం తీసుకునేంత వరకూ పార్టీ గుర్తు స్తంభింపజేస్తూ తాత్కాలిక ఉత్వర్వులు జారీ చేసి, వేర్వేరు గుర్తులపై పోటీ చేసేందుకు ఇరు వర్గాలను అనుమతించడం ఒక ఆప్షన్ కాగా, చిరాగ్ పాశ్వాన్ వర్గాన్ని పార్టీ సింబల్‌తో పోటీ చేసేందుకు అనుమతించడం రెండవది. పరపతి పరస్ వర్గానికి ఎల్‌జేపీ పార్టీ గుర్తు కేటాయించడం మూడవది. కాగా, పాశ్వాన్ గత శుక్రవారం నాడు ఈసీ కార్యాలయానికి వెళ్లి తమ పార్టీకే సింబల్ కొనసాగించాలని కోరారు. ఎల్‌జేపీలో గత జనవరిలో సంక్షోభం తెలెత్తింది. ఐదుగురు ఎంపీలు పాశ్వాన్ నుంచి పరస్ వర్గంలో చేరడంతో తానే పార్టీ అధ్యక్షుడినంటూ పరస్ (paras) ప్రకటించుకున్నారు.

సోమవారం నాడు దీనిపై ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈసీ నిర్ణయంపై ఇరు వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నాయి. అయితే ఎల్‌జేపీ గుర్తు తమదేనని చిరాగ్ పాశ్వాన్ మరోసారి స్పష్టం చేశారు. పవుపతి వర్గం నేతలు సైతం తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో దిగుతారని.. ఎల్‌జేపీ గుర్తు తమకు దక్కుతుందని ధీమాగా ఉన్నారు

First published:

Tags: Bihar, Election Commission of India, India, Politics