రాహు కాలంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్... ఆందోళనలో నాయకులు

సాయంత్రం 4.30 గంటల నుంచి 6 వరకు రాహు కాలం ఉండటమే దీనికి కారణంమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: March 10, 2019, 6:29 PM IST
రాహు కాలంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్... ఆందోళనలో నాయకులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు సర్వం సిద్ధమైంది. దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్‌సభ ఎన్నికలు 2019 తేదీల్ని కాసేపట్లో ఈసీ ప్రకటించనుంది. దీనిక సాయంత్రం 5 గంటలకు ముహుర్తం ఫిక్స్ చేసింది. అయితే....ఈ సమయం అంతా అనుకూలంగా లేదంటూ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలవుతున్న సమయం గురించి దక్షిణాది నేతలు టెన్షన్ పడుతున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 6 వరకు రాహు కాలం ఉండటమే దీనికి కారణంమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నేతలు ముఖ్యంగా వాస్తు, జ్యోతిష్యం, పంచాగాన్ని గట్గిగా నమ్ముతారు.

ప్రమాణస్వీకారాలు... పర్యటనలకు... రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కార్యం చేపట్టిన ముందుగా ముహుర్తాలపైనే దృష్టి పెడతారు. ఇక ఇటీవల కాలంలో రెండోసారి తెలంగాణ సీఎంగా అధికారం చేజెక్కించుకున్న కేసీఆర్ ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారు. శాసనసభను రద్దు చేయడం దగ్గర నుంచి ... ఎన్నికల ప్రచారానికి, రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారానికి, మంత్రి మండలి విస్తరణకు ఇలా అన్ని అంశాల్లో కేసీఆర్ గ్రహబలాల ఆధారంగానే ముందడుగు వేశారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం కుమారస్వామి తండ్రి దేవేగౌడ, మాజీ సీఎం యడ్యూరప్పకు కూడా ఇలాంటవాటిపై కాస్త నమ్మకం ఎక్కువే. ఇలాంటి నేపథ్యంలో రాహుకాలంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుండటంతో ఆయా నాయకులు ఆందోళనలో పడ్డారు.

అయితే లోక్ సభతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవుతుందా? లేదా? అనే విషయంలో మాత్రం సస్పెన్స్ నెలకొంది.
First published: March 10, 2019, 6:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading