Kamal Nath: ‘ఐటమ్’ కామెంట్స్‌పై మాజీ సీఎంకు ఈసీ నోటీసులు

ఐటెమ్ కామెంట్​పై వివాదం రేగడంతో మాజీ సీఎం కమల్​నాథ్​ స్పందించారు. ఆ టైమ్​లో పేరు గుర్తురాకపోవడం వల్లే ఆ పదం ఉపయోగించానని, అందులో వేరే ఉద్దేశం ఏమీలేదని వివరణ ఇచ్చారు.

news18-telugu
Updated: October 21, 2020, 8:14 PM IST
Kamal Nath: ‘ఐటమ్’ కామెంట్స్‌పై మాజీ సీఎంకు ఈసీ నోటీసులు
కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం
  • Share this:
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో మహిళా మంత్రి ఇమర్తి దేవిని ఉద్దేశించి ఆయన ‘ఐటమ్’ అంటూ చేసిన కామెంట్స్ మీద వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసుల్లో కోరింది. దీనిపై ఆయన ఉద్దేశం ఏంటో 48 గంటల్లో స్పష్టం చేయాలని నోటీసుల్లో పేర్కొంది. రెండు రోజుల క్రితం జాతీయ మహిళా కమిషన్ కూడా కమల్ నాథ్‌కు నోటీసులు జారీ చేసింది. మహిళా మంత్రిని అవమానించేలా కామెంట్స్‌‌‌‌ చేసిన మధ్యప్రదేశ్‌‌‌‌ మాజీ సీఎం కమల్‌‌‌‌నాథ్​పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ‘ఒక లీడర్‌‌‌‌‌‌‌‌ అయ్యి ఉండి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విచారకరం. మాజీ సీఎం ఉపయోగించిన పదాలు మహిళలను అవమానించేలా ఉన్నాయి. వారి గౌరవానికి భంగం కలిగిస్తాయి. మహిళలు ఎక్కువ సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ సమయంలో ఒక మహిళా లీడర్‌‌‌‌‌‌‌‌ను, అది కూడా ఒక బాధ్యతాయుతమైన‌‌ హోదాలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు‌‌‌ చేయడం బాధాకారం’ అని జాతీయ మహిళా కమిషన్ ప్రకటనలో‌ చెప్పింది. దబ్రా నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో కమల్‌‌‌‌నాథ్‌‌‌‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి సింపుల్‌‌‌‌గా ఉంటారని, బీజేపీ అభ్యర్థి ఓ ఐటమ్‌‌‌‌ అని, ఆమె పేరు కూడా పలకడం తనకు ఇష్టం లేదని కామెంట్‌‌‌‌ చేశారు.



ఇమర్తి దేవిపై కమల్‌‌‌‌నాథ్‌‌‌‌ కామెంట్స్‌‌‌‌కు నిరసనగా బీజేపీ లీడర్లు గత సోమవారం మౌనదీక్ష చేశారు. మధ్యప్రదేశ్‌‌‌‌ సీఎం శివ్‌‌‌‌రాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌ చౌహాన్‌‌‌‌, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి‌‌‌‌ నరేంద్ర సింగ్‌‌‌‌ తోమర్, ఇతర లీడర్లు పాల్గొన్నారు. కమల్‌‌‌‌నాథ్​కు దళిత మహిళను గౌరవించడం తెలియదని, సీఎం పోస్ట్‌‌‌‌ పోయినంక ఆయన మతిభ్రమించిందని ఇమర్తి దేవి అన్నారు. ఐటెమ్ కామెంట్​పై వివాదం రేగడంతో మాజీ సీఎం కమల్​నాథ్​ స్పందించారు. ఆ టైమ్​లో పేరు గుర్తురాకపోవడం వల్లే ఆ పదం ఉపయోగించానని, అందులో వేరే ఉద్దేశం ఏమీలేదని వివరణ ఇచ్చారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది. జ్యోతిరాదిత్య సింథియా‌ను బీజేపీ తమ వైపునకు తిప్పుకుంది. ఈ క్రమంలో 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఏకంగా కేబినెట్‌లోనే ఆరుగురు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఏడాది మార్చిలో బలపరీక్ష‌కు ముందు కమల్ నాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మళ్లీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కేబినెట్‌లో మహిళా మంత్రిపై కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలను చౌహాన్ ఖండించారు. ఆమెకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజలను ప్రేమించాలంటూ సూచించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 21, 2020, 8:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading