Home /News /politics /

ELECTION COMMISSION ANNOUNCED ELECTION SCHEDULE FOR WEST BENGAL TAMIL NADU KERALA ASSAM PUDUCHERRY ASSEMBLY POLLS BA

నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్.. Full Details

సీఈసీ సునీల్ అరోరా (File)

సీఈసీ సునీల్ అరోరా (File)

    నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది.ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. గత ఏడాది కరోనా ఎక్కువగా ఉన్న సమయంలో కూడా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఛాలెంజింగ్ అని సునీల్ అరోరా అన్నారు. కరోనా సమయంలో కూడా సేవలు అందించిన అధికారులను ఆయన అభినందించారు. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 18.68 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. వారికి 2.7 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 1000 మందికి ఒక పోలింగ్ స్టేషన్ ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అది కూడా పోలింగ్ బూత్ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటాయన్నారు. 80 ఏళ్ల పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించారు. కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈసారి ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

    అసోంలో మూడు దశల్లో ఎన్నికలు ఉంటాయి.

    మొదటి దశ ఎన్నికలు మార్చి 27

    రెండో దశ పోలింగ్ మార్చి ఏప్రిల్ 1

    మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6

    కేరళలో ఒకే దశలోనే ఎన్నికలు. పోలింగ్ తేదీ - ఏప్రిల్ 6 

    తమిళనాడులో ఒకే దశలోనే ఎన్నికలు. పోలింగ్ తేదీ - ఏప్రిల్ 6

    పుదుచ్చేరిలో ఒకే దశలోనే ఎన్నికలు. పోలింగ్ తేదీ - ఏప్రిల్ 6

    పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల్లో ఎన్నికలు

    మొదటి దశ ఎన్నికలు - మార్చి 27
    రెండో దశ ఎన్నికలు - ఏప్రిల్ 1
    మూడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 6
    నాలుగో దశ ఎన్నికలు - ఏప్రిల్ 10
    ఐదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 17
    ఆరో దశ ఎన్నికలు - ఏప్రిల్ 22
    ఏడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 26
    ఎనిమిదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 29

    అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ - మే 2న 

    పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ స్థానాలు 294. అక్కడ ప్రస్తుతం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పదేళ్లుగా మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారు. అక్కడ పాగా వేయాలని బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది.

    తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. పళనిస్వామి సీఎంగా ఉన్నారు. జయలలిత మరణం తర్వాత అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో పళనిస్వామి సీఎం అయ్యారు. బీజేపీ, అన్నాడీఎంకే కలసి పోటీ చేస్తున్నాయి. తమిళనాట పాగా వేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా అన్నాడీఎంకేను ముందు పెట్టి నడిపిస్తోంది.

    కేరళలో 140 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అక్కడ ఎల్ డీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కమ్యూనిస్టులకు మిగిలిన ఒకే ఒక రాష్ట్రం అయిన కేరళలో కూడా కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్తోంది. తాజాగా మెట్రో మ్యాన్‌గా పేరుపొందిన ఈ. శ్రీధరన్ కూడా బీజేపీలో చేరుతున్నారు. తాను సీఎం రేసులో ఉన్నానని ఆయన ప్రకటించారు.

    అసోంలో 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. సర్బానంద  సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈశాన్య రాష్ట్రం అయిన అసోంలో మళ్లీ పట్టు నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

    కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 33 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వారిలో ముగ్గురు నామినేటెడ్ సభ్యులు. 30 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ముగ్గురు నామినేటెడ్ సభ్యులు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో అక్కడ తాజాగానే నారాయణస్వామి ప్రభుత్వం పడిపోయింది. పుదుచ్చేరిలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: 5 State Elections, Assam Assembly Elections 2021, Election Commission of India, Kerala Assembly Elections 2021, Puducherry Assembly Elections 2021, Tamil Nadu Assembly Elections 2021, West Bengal Assembly Elections 2021

    తదుపరి వార్తలు