ఐపీఎల్ కూడా నిర్వహించలేకపోయారు...యూపీఏపై మోదీ విసుర్లు

మహాత్మా గాంధీపై భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలను మోదీ ఖండించారు. ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని..పార్టీతో సంబంధం లేదని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: May 17, 2019, 5:29 PM IST
ఐపీఎల్ కూడా నిర్వహించలేకపోయారు...యూపీఏపై మోదీ విసుర్లు
మోదీ ప్రెస్ మీట్
news18-telugu
Updated: May 17, 2019, 5:29 PM IST
దేశంలో మరోసారి మెజార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని ప్రధాని మోదీ ధీమావ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో అమిత్ షాతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించిన ప్రధాని మోదీ...విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో ఐపీఎల్ కూడా నిర్వహించలేకపోయారని.. ఈసారి ఎన్నికలతో పాటు ఐపీఎల్, రంజాన్, హనుమాన్ జయంతి, విద్యార్థుల పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు.

ఐదేళ్లలో సుపరిపాలన అందించాం. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా పథకాలను తీసుకొచ్చాం. గతంలో ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించారు. కానీ ఈసారి ఎన్నికలతో పాటే ఐపీఎల్ జరిగింది. రంజాన్, హనుమాన్ జయంతి, రామజయంతి, నవరాత్రి, విద్యార్థుల పరీక్షలు కూడా ఎన్నికలతో పాటే ప్రశాంతంగా జరిగాయి. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ఇది సాధ్యపడుతుంది. ఐదేళ్ల పాటు నన్ను ఆశీర్వదించినందుకు ప్రజలకు ధన్యవాదాలు. దశాబ్ధాల తర్వాత 2014 సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం.
నరేంద్ర మోదీ
మహాత్మా గాంధీపై భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలను మోదీ ఖండించారు. ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని..పార్టీతో సంబంధం లేదని స్పష్టంచేశారు. ఐదేళ్ల పాటు తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోదీ వెల్లడించారు.
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...