హోమ్ /వార్తలు /రాజకీయం /

50శాతం వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించాల్సిందే..సుప్రీంలో విపక్షాల రివ్యూ పిటిషన్

50శాతం వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించాల్సిందే..సుప్రీంలో విపక్షాల రివ్యూ పిటిషన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని..ఇండియాలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ఓటర్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేశారు.

  దేశంలో మూడోదశ పోలింగ్ ముగిసినా ఈవీఎంలపై రగడ కొనసాగుతూనే ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల పనితీరుపై విపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. ఈవీఎంలను సులభంగా హ్యాక్ చేయవచ్చని..ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 21 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయి. త్వరలో ఈ పిటిషన్‌పై విచారించనుంది కోర్టు


  ఈవీఎం స్లిప్పుల లెక్కింపులపై ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పుచెప్పింది. అన్ని వీవీప్యాట్లలోని ఓటర్ స్లిప్పులను లెక్కించడం సాధ్యంకాదని తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో ఏవైనా 5 వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీరుపై దేశంలోని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడం లేదని..ఇండియాలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ఓటర్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేశారు.


  మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఈవీఎంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి వచ్చిన వ్యక్తులు ఈవీఎంలను రష్యన్లు హ్యాక్ చేస్తారని బాంబు పేల్చారు. రూ.10 కోట్లిచ్చిన అభ్యర్థిని ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా గెలిపిస్తారని వ్యాఖ్యానించారు. ఇంత దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవని విమర్శించారు చంద్రబాబు. మరోవైపు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సైతం ఈవీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు. యూపీలో జరిగిన మూడో దశ ఎన్నికల్లో ఈవీఎంలు సరిగా పనిచేయలేదని విమర్శించారు. ఏ మీట నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని ఆరోపించారు.

  First published:

  Tags: EVM, Evm tampering, Lok Sabha Election 2019, Supreme Court, Vvpat

  ఉత్తమ కథలు