EGGS THROWN ON ODISHA CM CONOVAYED BJYM LEADERS PROTEST AGAINST STATE GOVERNMENT TWO LEADERS ARRESTED NGS
Odisha CM Convoy: ఒడిషాలో హీటెక్కిన రాజకీయం.. బీజేవైఎం ఆందోళనలు ఉధృతం.. సీఎం కాన్వాయ్‌పై దాడి
ఒడిషా సీఎంపై దాడి
Odisha CM Convoy: ఒడిషాలో ఎప్సుడూ పెద్దగా రాజకీయ హడావుడి కనిపించదు. రాజకీయాలన్నీ సైలెంట్ గానే ఉంటాయి. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి మారింది. ముఖ్యంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్ ఊహించని విధంగా గుడ్ల దాడి జరిగింది. పూరీలో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. అసలు ఏం జరిగిదంటే.
Attack on Odisha CM Convoy: ఎప్పుడు ప్రశాతంగా ఉంటే ఒడిషా (Odisha)రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అది కూడా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) కాన్వాయ్గుడ్ల దాడి జరిగింది అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.. బుధవారం పూరీలో 31 కోట్ల శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి.. సీఎం నవీన్ పట్నాయక్ హజరయ్యారు. తిరిగి వస్తుండగా.. ఆయన కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. పూరీ నుంచి భువనేశ్వర్(Bhuvaneswar)కు తిరిగి వెళ్తుండగా దర్జీపోఖారీ ఛక్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. కలహండి ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ప్రభుత్వానికి(Goverment) వ్యతిరేకంగా పూరీలో నిరసన చేపట్టిన బీజేవైఎం (BjYM)కార్యకర్తలు.. అ-త్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని వెళ్లి అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు (Eggs)విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. కాగా సీఎం కారుపై దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఈ దాడి చేసింది తామే అని బీజేవైఎం ఒడిషా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య ప్రకటించుకున్నారు. రాష్ట్రంలో దారుణమైన ఘటన జరిగినప్పుడు నిరసన తెలపకుండా ఎలా ఉంటామని ఆయన ప్రశ్నిస్తున్నారు. నేటి నుంచి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా నిరసన తప్పదని ఆయన హెచ్చరించారు. కలహండి ఉపాధ్యాయురాలు కిడ్నాప్, హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్‌ను రాష్ట్ర కేబినెట్ నుంచి వెంటనే తొలగించాలని.. లేదంటే అప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు కలహండి ఉపాధ్యాయురాలు కిడ్నాప్, హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి డీఎస్ మిశ్రాను తొలగించాలని కొన్ని వారాలుగా ప్రతిపక్షాలు డిమాండ్చేస్తున్నాయి. మహిళా టీచర్ మమతా మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్ మిశ్రా సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి.
ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే బుధవారం బీజేవైఎం కార్యకర్తలు పూరీలో ప్రభుత్వం తీరుకు నిరసనగా కొందరు ఆందోళనలు చేపట్టారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేశారు. జగన్నాథ ఆలయం ముందు ఉన్న గ్రాండ్ రోడ్‌పై పేడనీటిని చల్లి శుద్ధి చేశారు. అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి ‘కళంకిత రాష్ట్ర మంత్రులు హాజరయ్యారని.. అందుకే పవిత్ర మార్గాన్ని అపవిత్రం చేశారని బీజేవైఎం నేతలు వెల్లడించారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.