Video: వరంగల్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి

వరంగల్‌లో పరకాల ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేస్తున్న బీజేపీ కార్యకర్త

వరంగల్‌ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వరంగల్‌లో ఉన్న పరకాట ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఆందోళనకారులు ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు.

  • Share this:
    వరంగల్‌ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వరంగల్‌లో ఉన్న పరకాట ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఆందోళనకారులు ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. కోడి గుడ్లు, టమాటా లతో దాడి చేశారు. రామ మందిర నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలు ఎక్కడికి పోతున్నాయంటూ మీడియా సమావేశంలో ధర్మారెడ్డి కామెంట్స్ చేశారు. రాజకీయం కోసం రాముడిని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఆయన ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కోడిగుడ్లతో దాడి చేశారు.

    చల్లా ధర్మారెడ్డి ఏమన్నారు?
    అయోధ్య రామమందిరం కోసం విరాళాలు సేకరిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు. అయితే, బీజేపీ చేస్తున్న విరాళాల సేకరణలో పెద్ద పారదర్శకత లేదని చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. దీనికి లెక్కలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ‘గ్రామాల్లో తిరిగి చందాలు వసూలు చేస్తున్నారు. ఎక్కడ మీరు లెక్కలు కడుతున్నారు? దానికి లెక్కాపద్దులు ఎక్కడున్నాయి? రోజుకు ఎంత వసూలు చేస్తున్నారు? సాయంత్రానికి ఎంత వసూలైందో లెక్కలు రాస్తున్నారా? కేంద్రం రాస్తుందా? బీజేపీ రాస్తుందా? మీరు వసూలు చేసే పుస్తకాలను అన్ని పార్టీలకు ఇవ్వాలి. బీజేపీ కండువా వేసుకుని విరాళాలు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఎంత వసూలు చేశారు? మిగతా రాష్ట్రాల్లో ఎంత వసూలు చేశారు? అన్నీ లెక్క చెప్పాలి. ఆ తర్వాతే కొత్త వసూళ్లు చేపట్టాలి.’ అని ధర్మారెడ్డి డిమాండ్ చేశారు.

    అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి రూ.1100 కోట్లు ఖర్చవుతుందని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే చెప్పారని, మరి ఇంత పెద్ద ఎత్తున విరాళాల ద్వారా సేకరిస్తున్న సొమ్ము ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించారు. రూ.2900 కోట్లు ఖర్చు పెట్టి సర్దార్ పటేల్ విగ్రహాన్ని కట్టించిన కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు ఖర్చుపెట్టి అయోధ్యలో రామమందిరం నిర్మించలేదా? అని ప్రశ్నించారు.

    శ్రీరామచంద్రుడు తన ఇంటి వేల్పు అని, తన సొంత నిధులతో గుడి కట్టించానని చల్లా ధర్మారెడ్డి చెప్పారు. ఎవరికి వారు రామమందిరం పేరుతో వసూళ్లు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మండిపడ్డారు. వాళ్లే ఖర్చు పెట్టుకుంటున్నారన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేయవద్దని చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

    చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన కేటీఆర్
    టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పై బీజేపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండించారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదన్నారు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: