• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • ED RAIDS IN 5 PLACES INCLUDING TRS MP NAMA NAGESWARA HOUSE AND MADHUCON OFFICES SK

Nama Nageshwara rao: ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు..

నామా నాగేశ్వరరావు

మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకొని విదేశీ కంపెనీలు డబ్బులను మళ్లించినట్లు నామా నాగేశ్వరరావుపై అభియోగాలు వచ్చాయి. రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.

  • Share this:
    టీఆర్ఎస్‌కు ఈడీ షాకిచ్చింది.  ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసం, హైదరాబాద్‌లోని నామా నాగేశ్వరరావు కంపెనీ మధుకాన్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే సీఎండీ కే శ్రీనివాస్ రావు, డైరెక్టర్లు ఎన్. సీతయ్య, ఎన్. పృథ్వీ తేజ నివాసంలోనూ తనిఖీలు చేశారు. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకొని విదేశీ కంపెనీలు డబ్బులను మళ్లించినట్లు నామా నాగేశ్వరరావుపై అభియోగాలు వచ్చాయి.  రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈక్రమంలోనే నామా నివాసంతో పాటు కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ లోన్‌కు నామా నాగేశ్వరరావు పర్సనల్ గ్యారంటీర్‌గా ఉన్నారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే డైెరెక్టర్‌గా ఉన్న పృథ్వీ తేజ నామా నాగేశ్వరరావు తనయుడు. వీరి ఇళ్లల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తున్నారు. కంపెనీ అకౌంట్లు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన వివరాలను విశ్లేషిస్తున్నారు.

    2011లో  NH-33 పరిధిలోని రాంచీ-జంషెడ్‌పూర్ రోడ్డు నిర్మాణ పనులను మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు NHAI అప్పగించింది. 163 కి.మీ. రోడ్డు నిర్మాణం కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్ వే పేరిట పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు కెనరా బ్యాంక్ నేతృత్వంలో పలు బ్యాంకులు రూ.1151 కోట్ల రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఆ నిధులను రాంచీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కోసం వినియోగించాలి. కానీ పక్కదారి పట్టించి.. విదేశాలకు తరలించారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే మధుకాన్ కంపెనీపై సీబీఐ మనీలాండరింగ్ కేసు నమోదయింది. ఏళ్లు గడిచినా రోడ్డు నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదని సీబీఐ ఆరోపించింది. రూ.1029 కోట్ల బ్యాంకు రుణాలు దుర్వినియోగం అయ్యాయని గుర్తించింది. బ్యాంకులు మంజూరు చేసిన లోన్ నాన్ ఫర్మామింగ్ అసెట్‌(నిరర్థక ఆస్తులు)గా మారిందని 2018లో సీబీఐ వెల్లడించింది.

    అనంతరం 2019లో మధుకాన్ కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీబీఐ కేసు నమోదు కావడంతో 2019లో రాంచీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ బాధ్యత నుంచి ఈ కంపెనీని నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా తొలగించింది. ఇక 2020లో రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. మధుకాన్ ప్రాజెక్ట్స్, మధుకాన్ ఇన్‌ఫ్రా, మధుకాన్ టాలీ హైవే కంపెనీతో పాటు రుణాలు ఇచ్చిన బ్యాంకుల కన్షార్సియం ఆడిటర్లు, అధికారుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ నామా నాగేశ్వరావు నివాసం, మధుకాన్ కంపెనీ కార్యాలయం, డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published: