ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి ఈడీ నోటీసులు

తెలుగు రాష్ట్రాల్లో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురు ప్రముఖ రాజకీయ నేతలకు నోటీసులు అందాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి.. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

news18-telugu
Updated: February 12, 2019, 7:28 PM IST
ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి ఈడీ నోటీసులు
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: February 12, 2019, 7:28 PM IST
3ఏళ్ల క్రితం సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి... తన కుమారులతో సహా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు వారిని హైదరాబాద్‌లోని కార్యాలయంలో  విచారించారు. అయితే, విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని... వేం నరేందర్ రెడ్డి చెప్పారు. తనను, తన కుమారులను వేర్వేరుగా విచారించారని, కేసుకు సంబంధించి అధికారులు అడిగిన డ్యాక్యుమెంట్లన్నింటినీ అందించామని చెప్పారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించినట్టు తెలుస్తోందని చెప్పారు.

ఇక, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అప్పట్లో టీడీపీ నేతగా ఉన్న వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వజూపారన్న అభియోగంతో రేవంత్ రెడ్డిపై ఏసీబీ అధికారులు దాఖలు చేసిన అభియోగంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే కేసులో నిందితులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని విచారించారు. తాజాగా, రేవంత్ రెడ్డికీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో సెబాస్టియన్, టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్యలు సైతం నిందితులుగా ఉన్నారు.
వేం నరేందర్‌రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు.. ప్రధానంగా రేవంత్ రెడ్డి స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు విచారణ పూర్తిగా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...