చిదంబరానికి మరో షాక్.. ఈడీ అరెస్ట్‌కు కోర్టు అనుమతి

తీహార్ జైల్లో విచారణ చేసేందుకు స్పెషల్ సీబీఐ జడ్జి అజయ్ కుమార్ అనుమతిచ్చారు. అవసరమైతే అరెస్ట్ చేయవచ్చని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో బుధవారం చిదంబరంను ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశముంది.

news18-telugu
Updated: October 15, 2019, 5:16 PM IST
చిదంబరానికి మరో షాక్.. ఈడీ అరెస్ట్‌కు కోర్టు అనుమతి
చిదంబరం
  • Share this:
ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరో షాక్ తగిలింది. చిదంబరం సీబీఐ జుడిషియల్ కస్టడీ మరో రెండు రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో మళ్లీ ఎదురు దెబ్బతగిలింది. చిదంబరాన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకునేందుకు ఈడీకి అనుమతి మంజూరు చేసింది. తీహార్ జైల్లో విచారణ చేసేందుకు స్పెషల్ సీబీఐ జడ్జి అజయ్ కుమార్ అనుమతిచ్చారు. అవసరమైతే అరెస్ట్ చేయవచ్చని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో బుధవారం చిదంబరంను ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశముంది.

కాగా, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను ఆగస్టు 21న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన 40 రోజులుగా (సెప్టెంబర్ 5 నుంచి) తీహార్‌ జైల్లో ఉన్నారు. అక్టోబరు 3న సీబీఐ విజ్ఞప్తి మేరకు చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని అక్టోబరు 17కు కోర్టు పొడిగించింది. మరో రెండు రోజుల్లో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఈడీ కేసుపై విచారించిన హైకోర్టు..చిదంబరం అరెస్ట్‌కు అనుమతినిచ్చింది.
First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు