లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్: జాయింట్ కలెక్టర్‌పై ఈసీ బదిలీ వేటు

చిత్ర ప్రదర్శనను అడ్డుకోవడంలో జాయింట్ కలెక్టర్ విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే కడప జిల్లా జేసీ కోటేశ్వరరావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: May 13, 2019, 10:35 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్: జాయింట్ కలెక్టర్‌పై ఈసీ బదిలీ వేటు
లక్ష్మిస్ ‘ఎన్టీఆర్’
  • Share this:
కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) కోటేశ్వరరావుపై ఎన్నికల సంఘం బదిలీ వేటువేసింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకుంది. సెన్షేషన్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలపై ఎన్నికల సంఘం ఆంక్షలు కొనసాగుతున్నాయి. మే 19 వరకు సినిమాను విడుదల చేయవద్దని ఆదేశాలున్నాయి. ఐతే ఏపీలోని కొన్ని థియేటర్లలో మాత్రం సినిమా విడుదలయింది. కడప జిల్లాలో పలు థియేటర్ల 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీని ప్రదర్శించారు.

ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. చిత్ర ప్రదర్శనను అడ్డుకోవడంలో జాయింట్ కలెక్టర్ విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే కడప జిల్లా జేసీ కోటేశ్వరరావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధంలేని విధుల్లో ఆయన్ను నియమించాలని ప్రభుత్వానికి సూచించింది
Published by: Shiva Kumar Addula
First published: May 13, 2019, 10:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading