నిజామాబాద్ లోక్సభ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేంగా ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. అడ్డం 6. నిలువు ఆరు చొప్పున ఎల్ ఆకారాంలో బ్యాలెట్ యూని్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అడ్డం, నిలువుగా ఉన్న బ్యాలెట్ యూనిట్ల మధ్య వీవీప్యాట్లను అమర్చనున్నారు. దీంతోపాటు బ్యాలెట్ యూనిట్లకు వరుస క్రమంలో నెంబర్లను కేటాయించనున్నారు. ముందుగా జాతీయ పార్టీ, తర్వాత ప్రాంతీయ పార్టీ ఆ తర్వాత స్వతంత్రులుగా పోటీ చేసే అభ్యర్థులకు అక్షర క్రమంలో గుర్తులు కేటాయిస్తారు. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు బ్యాలెట్ యూనిట్-1లో ఉండనున్నాయి. అలాగే అభ్యర్థి గుర్తు ఏ బ్యాలెట్ యూనిట్లో ఉంటుందనే విషయాన్ని పోలింగ్ స్టేషన్ ముందు ప్రదర్శించే విధంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మీడయాకు వివరించారు. ముఖ్యమైన కూడళ్లలోనూ అభ్యర్థుల గుర్తుల్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు.ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలపారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగ నిజామాబాద్లో 185మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నియోజకవర్గపరిధిలో మొత్తం 1788 పోలింగ్ స్టేషన్లలో 27,185 బ్యాలెట్ యూనిట్లు, 530 కంట్రోల్ యూనిట్లు, 3651 వీవీప్యాట్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏడవ తేదీ రాత్రికి అన్నియంత్రాలు నిజామాబాద్ చేరుకుంటాయన్నారు. నిజామాబాద్ పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించలేదన్న ఆరోపణలు సరికాదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lok Sabha Election 2019, Nizamabad, Nizamabad S29p04, Telangana Lok Sabha Elections 2019