ఏపీలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి ఈసీ షెడ్యూల్‌ .. పోలింగ్ ఎప్పుడంటే

డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సోమవారం షెడ్యూల్‌ విడుదల విడుదల చేసింది.

news18-telugu
Updated: June 15, 2020, 4:57 PM IST
ఏపీలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి ఈసీ షెడ్యూల్‌ .. పోలింగ్ ఎప్పుడంటే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భర్తీకి షెడ్యూల్ విడుదలయింది. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సోమవారం షెడ్యూల్‌ విడుదల విడుదల చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడనుంది. జులై 6న పోలింగ్‌ నిర్వహిస్తారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఉందని, 26న నామినేషన్లను పరిశీలన, 29 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. శాసనసభ్యుల కోటాలో ఈ ఎమ్మెల్సీ స్థానం భర్తీ కానుంది. జులై 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి.. ఫలితాన్ని ప్రకటిస్తారు.
Published by: Shiva Kumar Addula
First published: June 15, 2020, 4:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading