EC ORDERS FIR AGAINST ARVIND KEJRIWAL CHARANJIT SINGH CHANNI AND SUKHBIR BADAL FOR POLL CODE VIOLATION MKS
Punjab Polls: ఇద్దరు సీఎంలపై EC కొరడా.. మాజీ డిప్యూటీ సీఎంపైనా కేసులకు ఆదేశం..
నేతలపై ఈసీ కొరడా
మరి కొద్ది గంటల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా ముఖ్యపార్టీలకు చెందిన బడా నేతలపై ఎన్నికల సంఘం కన్నెర్రచేసింది. ఇద్దరు సిట్టింగ్ సీఎంలు, మరో మాజీ డిప్యూటీ సీఎంపై కేసుల నమోదుకు ఈసీ ఆదేశాలిచ్చింది.
మరి కొద్ది గంటల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా ముఖ్యపార్టీలకు చెందిన బడా నేతలపై ఎన్నికల సంఘం కన్నెర్రచేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ పంజాబ్ కాంగ్రెస్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, ఢిల్లీ సీఎం (ఆప్ చీఫ్) అరవింద్ కేజ్రీవాల్, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు ఈసీ ఆదేశాలివ్వడంతో శనివారం ఆ ముగ్గురితోపాటు మరొకొందరు నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఆప్ జాతీయ కన్వీయర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో అకాలీదళ్, ఇతర రాజకీయ పార్టీలను దూషించారన్న ఆరోపణలపై ఎన్నికల అధికారులు విచారణ చేసి, కేసు నమోదుకు ఆదేశాలిచ్చారు. అకాలీని అరవింద్ కేజ్రీవాల్ తిట్టిపోసి ఆ వీడియో సోషల్ మీడియాలోనై వైరలైంది. ఇక ఆప్ ఫిర్యాదుతో అకాలీ చీఫ్ బాదల్ పై కేసు నమోదైంది.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు SAD చీఫ్ సుఖ్బీర్ బాదల్‌పై చర్య తీసుకోవాలని ఆప్ కోరింది. ప్రచార సమయం దాటిన తర్వాత మార్గదర్శకాలను బాదల్ ఉల్లంఘించారని తేలడంతో కేసు నమోదుకు ఈసీ ఆదేశాలిచ్చింది. ఇక పంజాబ్ సీఎం చన్నీపైనా ఇలాంటి కేసే నమోదైంది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మాన్సా జిల్లాలో పంజాబ్ సీఎం చన్నీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రముఖ పంజాబీ సింగర్ శుభదీప్ సింగ్ ప్రచారం నిర్వహించారు. కాగా, ప్రచార సమయం ముగిసిన ఏ మాత్రం పట్టించుకోకుండా.. మాన్సా నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం (ఈసీ) కి ఫిర్యాదు చేయడంతో సీఎం చన్నీ, మూసే వాలా లపై ఐపీసీ సెక్షన్ 188, ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఆదివారం (ఫిబ్రవరి 20న) పోలింగ్ జరుగనుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.