Home /News /politics /

EC ISSUES NOTIFICATION FOR 12 MLCS FOR LOCAL BODY QUOTA IN TELANGANA POLLING ON DEC 10 MKS

Telangana : 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ -cm kcr అనూహ్య ఎత్తులు -revanth reddy దిగుతారా?

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కొనసాగుతున్నది. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్ దాఖలుకు మంగళవారం చివరి రోజు కాగా, స్ఘానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవాళే విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో పదవులు పొందలేని టీఆర్ఎస్ నేతలంతా తిరిగి ప్రగతి భవన్ వైపునకు పరుగులు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా? లేదా? అనేదానిపైనా సస్పెన్స్ కొనసాగుతోంది..

ఇంకా చదవండి ...
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ((MLC Elections) సందడి కొనసాగుతున్నది. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్ దాఖలుకు మంగళవారం చివరి రోజు కావడంతో నాటకీయ పరిణామాల మధ్య అధికార టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థుల్ని ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల సంఘం.. స్ఘానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుల చేసింది. దీంతో ఎమ్మెల్యే కోటాలో పదవులు పొందలేని టీఆర్ఎస్ నేతలంతా  సీఎం కేసీఆర్ (CM KCR)ను కలిసేందుకు ప్రగతి భవన్ వైపునకు పరుగులు పెడుతున్నారు. బీజేపీ పోటీ చేసే అవకాశం లేకపోగా, ఫిరాయింపుల వల్ల తెలంగాణలో ప్రతిపక్ష స్థానం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఉన్న సంఖ్యాబలంతో స్థానిక ఎన్నికల బరిలోకి దిగుతుందా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది.

తెలంగాణలో స్థానిక సంస్థ‌ల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించేలా ఈసీ మంగళవారం నాడు నోటిఫికేష‌న్ జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం.. నేటి(నవంబర్ 16) నుంచి ఈ నెల 23 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 26. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు డిసెంబ‌ర్ 10న పోలింగ్ జరుగనుంది. డిసెంబ‌ర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. కాగా,

TRS : నిన్న జిల్లా కలెక్టర్.. నేడు ఎమ్మెల్సీ : వెంకట్రామిరెడ్డికి cm kcr బంపరాఫర్


తొమ్మిది ఉమ్మ‌డి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఇప్పుడు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 1, వరంగల్‌ 1, నల్లగొండ 1, మెదక్‌ 1, నిజామాబాద్‌ 1, ఖమ్మం 1, కరీంనగర్‌ 2, మహబూబ్‌నగర్‌ 2, రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. నిజానికి ఈ 12 స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం 2022 జనవరి 4తో ముగియనున్నా, భర్తీ ఎన్నికల ప్రక్రియను ముందస్తుగానే చేపట్టారు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలూ టీఆర్ఎస్ కు ఏకగ్రీవం అయిపోగా, 12 స్థానిక ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఆ పార్టీనే మెజార్టీ సీట్లు కైవసం చేసుకోనుంది.

etela rajenderపై ప్రతీకారం! -cm kcr షాకింగ్ ట్విస్ట్ : సిట్టింగ్ ఎంపీకి ఎమ్మెల్సీ పదవి -trs mlc వీరే


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందని ఆశించి, సీఎం కేసీఆర్ ఫోన్ కాల్ తో ప్రగతి భవన్ కు వచ్చిన నేతలకు కూడా అనూహ్య రీతిలో నిరాశ ఎదురన నేపథ్యంలో అసంతృప్తులకు స్థానిక ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మెదక్ జిల్లాకు చెందిన దళిత నేత ఎర్రోళ్ల శ్రీనివాస్.. ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీ కావాల్సి ఉన్నా.. సిద్ధిపేట కలెక్టర్ గా రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డివైపు సీఎం కేసీఆర్ మొగ్గుచూపడంతో ఎర్రోళ్లకు నిరాశ తప్పలేదు. అయితే, మెదక్ జిల్లాలోని ఆ ఒక్క స్థానంలో ఎర్రోళ్లకు అవకాశం కల్పిస్తారా? లేక గవర్నర్ కోటాలో మడలికిం పంపుతారా అనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా ప్రాబబుల్స్ లో చివరిక్షణం దాకా ఉండి, అనూహ్య రీతిలో రాజ్యసభ ఎంపీ బండ ప్రకాశ్ ఎంట్రీతో అవకాశం కల్పోయిన మధుసూదనా చారిని కూడా స్థానిక సంస్థల బరిలో దింపి, గెలిచిన తర్వాత మండలి చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే కోటాలో గెలిచే అవకాశం లేక పోటీకి దూరంగా ఉండిపోయిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా బరిలోకి దిగుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కు అక్కడక్కడా సీట్లు లభించడం తెలిసిందే. స్ఘానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై అన్ని జిల్లాల నేతలతో కూలంకశంగా చర్చించి, మంగళవారం నాడు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇదివరకే చెప్పారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Congress, Mlc elections, Revanth reddy, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు