Home /News /politics /

EC DOESNT LOOK POWERLESS ANYMORE SC REFUSES TO ENTERTAIN MAYAWATIS PLEA AGAINST 48 HOUR CAMPAIGN BAN SK

మాయావతికి చుక్కెదురు..ఈసీ మేల్కొందన్న సుప్రీంకోర్టు

‘ముస్లింలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీ ఓటు వృధా చేసుకోవద్దు. అందరూ ఎస్పీ - బీఎస్పీ కూటమికి వేయండి.’ అని వ్యాఖ్యానించడం ద్వారా మాయావతి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు.

‘ముస్లింలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీ ఓటు వృధా చేసుకోవద్దు. అందరూ ఎస్పీ - బీఎస్పీ కూటమికి వేయండి.’ అని వ్యాఖ్యానించడం ద్వారా మాయావతి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు.

ఓ ఎన్నికల ప్రచార సభలో మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలంతా ఎస్పీ-బీఎస్పీ కూటమికే ఓటు వేయాలని...కాంగ్రెస్, బీజేపీకి ఓటువేయకూడదని చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈసీ చర్యలు తీసుకుంది.

బీఎస్పీ అధినేత్రి మాయావతికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. ఆమె ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధాజ్ఞలు విధించడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈసీ ఇప్పటికైనా మేల్కొందన్న కోర్టు..విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తి చేసింది. దాంతో ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మాయావతికి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె పటిషన్‌ను విచారించలేమని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు.

ఎన్నికల ప్రచారంలో విద్వేష ప్రసంగాలు చేసినందుకు మాయావతితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆజం ఖాన్, మేనకాం గాంధీ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. యోగి ఆదిత్యనాథ్, ఆజంఖాన్‌పై 72 గంటలు, మాయావతి, మేనకా గాంధీపై 48 గంటలు నిషేధాజ్ఞలు విధించింది. అప్పటి వరకు ఎలాంటి ఎన్నికల ర్యాలీలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీచేసింది. కాగా, రెండు రోజుల క్రితం ఓ ఎన్నికల ప్రచార సభలో మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలంతా ఎస్పీ-బీఎస్పీ కూటమికే ఓటు వేయాలని...కాంగ్రెస్, బీజేపీకి ఓటువేయకూడదని చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈసీ చర్యలు తీసుకుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Bsp, Election Commission of India, Lok Sabha Election 2019, Mayawati, Sp-bsp, Uttar pradesh, Uttar Pradesh Lok Sabha Elections 2019

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు