తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : రజత్ కుమార్

Rajath Kumar on Election Arrangements : రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం రూ.52కోట్ల 62లక్షలకు పైగా నగదు పట్టుబడిందని తెలియజేశారు. పోలింగ్ రోజు అన్ని ప్రైవేటు సంస్థలు సెలవు ఇవ్వాల్సిందేనని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

news18-telugu
Updated: April 8, 2019, 8:23 PM IST
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : రజత్ కుమార్
రజత్ కుమార్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 8, 2019, 8:23 PM IST
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2 కోట్ల 97లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని.. 34,604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గం. నుంచి సాయంతర్ం గం. వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అలాగే అత్యధికంగా 180మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌లో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల దాకా పోలింగ్ జరుగుతుందని తెలియజేశారు.

పోలింగ్‌కు రెండు రోజుల ముందే ప్రచార పర్వానికి తెరపడుతుందని.. ఎవరూ సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4169 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. సి-విజిల్ ద్వారా 1430 ఫిర్యాదులు అందాయని.. ప్రగతి భవన్‌లో రాజకీయ కార్యకలాపాలపై కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపినట్టు వెల్లడించారు. చీఫ్ సెక్రటరీపై ఇచ్చిన ఫిర్యాదుకు ఆయన నుంచి నివేదిక తీసుకుని ఈసీకి పంపించామని తెలిపారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం రూ.52కోట్ల 62లక్షలకు పైగా నగదు పట్టుబడిందని తెలియజేశారు. పోలింగ్ రోజు అన్ని ప్రైవేటు సంస్థలు సెలవు ఇవ్వాల్సిందేనని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

First published: April 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...