ఈసీ దూకుడు...మేనకా, ఆజం ఖాన్‌ ప్రచారంపై నిషేధాజ్ఞలు

ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆజం ఖాన్‌ ప్రచారంపై 72 గంటలు, మేనకా గాంధీ ప్రచారంపై 45 గంటల పాటు నిషేధాజ్ఞలు విధించారు.

news18-telugu
Updated: April 15, 2019, 10:50 PM IST
ఈసీ దూకుడు...మేనకా, ఆజం ఖాన్‌ ప్రచారంపై నిషేధాజ్ఞలు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆజం ఖాన్‌ ప్రచారంపై 72 గంటలు, మేనకా గాంధీ ప్రచారంపై 45 గంటల పాటు నిషేధాజ్ఞలు విధించారు.
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. నేతల మాటల తూటాలతో రాజకీయ వేడి సెగలు రేపుతోంది. నోరు అదుపులో పెట్టుకోకుండా ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మాయావతి ఎన్నికల ప్రచారంపై నిషేధాజ్ఞలు విధించారు. ఇక తాజాగా సమాజ్‌వాదీ పార్టీ కీలక నేత ఆజంఖాన్, కేంద్రమంత్రి మేనకా గాంధీపైనా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆజం ఖాన్‌ ప్రచారంపై 72 గంటలు, మేనకా గాంధీ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధాజ్ఞలు విధించారు.

రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆజంఖాన్ ఇటీవలకాలంలో నోరుపారేసుకుంటున్నారు. అదే ప్రాంతం నుంచి బీజేపీ తరపున పోటీకి దిగుతున్న జయప్రదపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్‌ వ్యవహారంపై జాతీయ మహిళ కమిషన్ సైతం సీరియస్ అయ్యింది. ఆయనకు నోటీసులు సైతం పంపింది. ఆజం వ్యాఖ్యలపై రాంపూర్‌లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

ఇక మేనకా గాంధీ సైతం ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం తీవ్ర దుమారం రేపాయి. ముస్లింలు తనకే ఓటు వేయాలని.. ఒకవేళ వేయకపోతే.. ఒక ప్రజాప్రతినిధిగా తనవైపు నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అందవని స్పష్టం చేశారు. మేనకా చేసిన ఈ వ్యాఖ్యలు ఒకరకంగా బ్లాక్‌మెయిల్ చేయడమే అన్న విమర్శలు గట్టిగా వినిపించాయి. ఈ క్రమంలో మేనకా గాంధీ ప్రచారంపై ఆంక్షలు విధించింది ఈసీ.

ఇది కూడా చదవండి:బీజేపీకి బూస్ట్..యోగి ఇలాఖాలో 'రేసుగుర్రం' విలన్..

యోగి, అజంపై చర్యలు తీసుకోవల్సీందే..మెహబూబా ముప్తీ

సుప్రీం అక్షింతలు...యోగి ఆదిత్యనాథ్, మాయావతి ఎన్నికల ప్రచారంపై ఈసీ
First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>