ప్రధాని మోదీ వెబ్ సిరీస్ నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం...

ఎరోస్ సంస్థ నిర్మించిన మోదీ వెబ్ సిరీస్‌ను నిలుపుదల చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోదీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగా నిబంధనలను అనుసరించి వెబ్ సిరీస్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం లేదని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

news18-telugu
Updated: April 20, 2019, 5:17 PM IST
ప్రధాని మోదీ వెబ్ సిరీస్ నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం...
మోదీ వెబ్ సిరీస్ పోస్టర్ (ఫైల్ చిత్రం)
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా నిర్మించిన ఎరోస్ సంస్థ నిర్మించిన వెబ్ సిరీస్ ను వెంటనే ప్రదర్శన నిలిపివేయాలని ఎలక్షన్ కమీషన్ ఆదేశించింది. ఇప్పటికే ఏప్రిల్ 11న విడుదల కావాల్సిన మోదీ బయోపిక్‌ను నిలిపివేయగా, ప్రస్తుతం మోదీ వెబ్ సిరీస్‌ను కూడా ఈసీ ప్రదర్శన నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. దీంతో ఎరోస్ సంస్థ తన యాప్, అలాగే ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో మోదీ వెబ్ సిరీస్ ను నిలిపివేసింది. నరేంద్ర మోదీ ప్రస్తుతం ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంగా చిత్ర ప్రదర్శణ నిలిపివేయాల్సిందిగా ఈసీ ఆదేశించింది.

ఇదిలా ఉంటే మోదీ జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ పేరిట సిద్ధంగా ఉన్న ఈ వెబ్ సరీస్ మొత్తం 5 ఎపిసోడ్లుగా నిర్మించారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్, అలాగే మొబైల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ప్రధానంగా మోదీ చిన్నతనం నుంచి ప్రధానమంత్రి పదవి వరకూ కొనసాగిన జీవితాన్ని కథాంశంగా తీసుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించగా, సీనియర్ నటుడు మహేశ్ ఠాకూర్ మోదీ పాత్రలో నటించారు.


First published: April 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading