Home /News /politics /

EBC RESERVATIONS YSRCP VIJAYASAI REDDY SAYS CHANDRABABU MAY CLAIMS CREDIT FOR EBC RESERVATIONS

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు...చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు

విజయసాయి రెడ్డి(File)

విజయసాయి రెడ్డి(File)

EBC Reservations | అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు తన ఐడియానే అని, మోదీ కాపీ కొట్టారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకునే అవకాశం ఉందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

    సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తన వ్యంగ్యాస్త్రాల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల అంశంలోనూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి తానే సలహా ఇచ్చానని రేపు చంద్రబాబు అన్నా అంటారని ఎద్దేవా చేశారు. అప్పట్లో మోడీ అసాధ్యమన్నారని, ఇప్పుడు తన సలహాను కాఫీ కొట్టారని చంద్రబాబు చెప్పే అవకాశం ఉందన్నారు. పనిలో పనిగా టీడీపీ అనుకూల మీడియాను టార్గెట్ చేశారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు తన క్రెడిట్‌గా చంద్రబాబు చెప్పుకుంటే...టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబు భజన మొదలుపెడుతాయని ఎద్దేవా చేశారు.

    First published:

    Tags: AP Politics, Vijayasai reddy, Ys jagan padayatra, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు