తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను వచ్చేవారం సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి తొలగిస్తున్నారని ప్రకటించారు. తెలంగాణలో కరోనా వైరస్ కేసుల మీద నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా పరీక్షల అంశంలో, గాంధీ ఆస్పత్రి డాక్టర్ల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు వ్యక్తంఅవుతున్నాయి. ఈటలను కేబినెట్ నుంచి తొలగించేందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఈ పరిస్థితి తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ టెస్టుల సంఖ్య 50వేలు కూడా దాటలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా వైరస్ వస్తే ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మండిపడ్డారు. సామాన్యులను గాంధీ ఆస్పత్రికి తరలించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సహాయనిధికి రేవంత్ రెడ్డి రూ.2లక్షల చెక్ అందజేశారు.
తెలంగాణలో కరోనా వైరస్ పరీక్షలు సరైనంతగా నిర్వహించడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్‌కు అనుగుణంగానే టెస్టులు చేస్తున్నామని ఈటల చెప్పారు. అలాగే, గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు మంత్రి మాట వినే పరిస్థితి లేదు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను తీరుస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చినా కూడా వారు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eetala rajender, Revanth reddy, Telangana