Dalit Youth tonsure Case: రాజమండ్రి యువకుడి శిరోముండనం కేసులో రాష్ట్రపతి కీలక నిర్ణయం

Rajahmundry Dalit Youth tonsure Case | ఈ కేసులో యువకుడికి న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి కేంద్ర సామాజిక న్యాయ శాఖను ఆదేశించారు.

news18-telugu
Updated: August 18, 2020, 9:48 PM IST
Dalit Youth tonsure Case: రాజమండ్రి యువకుడి శిరోముండనం కేసులో రాష్ట్రపతి కీలక నిర్ణయం
ఏపీలో దళిత యువకుడికి శిరోముండనం.. స్పందించిన రాష్ట్రపతి
  • Share this:
Ramnath Kovind orders on East Godavari Dalit Youth Case | తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడికి పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేసిన ఘటనపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ఫైల్‌ను కేంద్ర సామాజిక న్యాయ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీన్ని ఎమర్జెన్సీ కేసుగా పరిగణించి వెంటనే విచారణ జరపాలంటూ రాష్ట్రపతి సెక్రటరీ అశోక్ కుమార్ ఆదేశాలిచ్చారు. సీతానగరంలో దళిత యువకుడికి పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేసిన ఘటనపై ఏపీలో దుమారం రేగిన విషయం తెలిపిందే. ఈ కేసులపై రాష్ట్రపతి కార్యాలయం గతంలో స్పందించింది. దళిత యువకుడికి శిరోముండంన చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. బాధితుడు వరప్రసాద్‌కు అండగా ఉండేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఈ నేపథ్యంలో ఏపీ సాధారణ పరిపాలనా విభాగానికి కేసుకు సంబంధించిన దస్త్రం బదిలీ అయింది. అసిస్టెంట్‌ సెక్రటరీ జనార్ధన్‌ బాబును కలవాలని, శిరోముండనం కేసు విషయంలో ఆయనకు సహకరించాలని వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. జనార్దనబాబును తాను సంప్రదించినా స్పందనలేదని బాధితుడు ప్రసాద్‌ వాపోయాడు. ఈ నేపథ్యంలో కేసు దస్త్రాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ తాజాగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

ఈ ఏడాది జూలైలో సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలున్నాయి. స్థానిక వైసీపీ నాయకుడి ఫిర్యాదుతో అతడిని అదుపులోకి తీసుకొని బెల్ట్‌తో కొట్టారని, అనంతరం పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మండిపడింది. దళితులను వైసీపీ నేతలు వేధిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇక శిరోముండనం ఘటనతో మనస్థాపం చెందిన వరప్రసాద్ ఇటీవల రాష్ట్రపతి కార్యాలయానికి లేఖరాశారు. దళితుడికి అన్యాయం జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని, తాను నక్సలైట్లలో కలుస్తానని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై స్పందించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 18, 2020, 9:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading