• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • EARLY TRENDS SHOW THAT BJP LEADER SOVENDU ADHIKARI IS LEADING IN NANDIGRAM BUT NOW MAMATA BANERJEE IS LEADING SSR

Nandigram Result: నందిగ్రామ్‌లో వెనకబడి మళ్లీ ఆధిక్యంలోకి మమత.. బీజేపీ దూసుకొస్తుందిగా..!

సువేందు అధికారి, మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గం నందిగ్రామ్. ఈ నందిగ్రామ్‌లో తొలుత ట్రెండ్స్‌ను పరిశీలించగా.. సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ మమతనే ఆధిక్యంలోకి కనబర్చారు. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఈ స్థానం నుంచి పోటీ చేయడం, సువేందు అధికారి తనపై గెలవాలని మమతకు సవాల్ విసిరి మరీ Nandigram నుంచి పోటీ చేయడంతో నంద్రిగామ్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • Share this:
    West Bengal Election Results: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అనుకున్నది సాధించే దిశగా వెళుతోంది. తొలి రౌండ్ నుంచే మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించగా.. టీఎంసీ ప్రస్తుతం 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. 54 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గం నందిగ్రామ్. ఈ నందిగ్రామ్‌లో తొలుత ట్రెండ్స్‌ను పరిశీలించగా.. సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ మమతనే ఆధిక్యంలోకి కనబర్చారు. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఈ స్థానం నుంచి పోటీ చేయడం, సువేందు అధికారి తనపై గెలవాలని మమతకు సవాల్ విసిరి మరీ Nandigram నుంచి పోటీ చేయడంతో నంద్రిగామ్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెండో విడతలో మమత పోటీ చేసిన నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో పోలింగ్ జరిగింది. బెంగాల్‌లో 294 స్థానాలకు ఎన్నికలు జరిగినప్పటికీ మమత పోటీ చేసిన నియోజకవర్గం ఫలితం పైనే అత్యంత ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు.

    మమత ప్రధాన అనుచరుడైన సువేందు అధికారి బీజేపీలో చేరి ఆమెపైనే పోటీకి దిగడం, ఆమె కూడా గతంలో పోటీ చేస్తున్న స్థానం నుంచి కాకుండా నందిగ్రామ్‌లో బరిలో నిలవడంతో మమత నియోజకవర్గ ఫలితంపై ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. రెండు స్థానాల్లో పోటీ చేయాలని తొలుత మమత భావించినప్పటికి నందిగ్రామ్‌లో ఓటమి భయంతోనే మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని మమత నిర్ణయించుకున్నారని బీజేపీ ఎద్దేవా చేయడంతో ఆమె వెనక్కి తగ్గారు. Nandigram నుంచే నామినేషన్ వేశారు.

    Election Results 2021 Live Updates కోసం క్లిక్ చేయండి

    నందిగ్రామ్‌లో మమత ఓటమి ఖాయమైపోయిందంటూ అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రచారం చేశారు. సువేందు మమతపై భారీ మెజార్టీతో గెలుస్తారని, బెంగాల్‌లో మార్పు మమత ఓటమితోనే మొదలవుతుందని ఎన్నికల ర్యాలీలో అమిత్ షా చెప్పుకొచ్చారు.
    Published by:Sambasiva Reddy
    First published: