ఒక్కో జన్ ధన్ ఖాతాలో రూ.10,000... ఎలా వచ్చాయి... ఎవరు వేశారు? దర్యాప్తు చేస్తున్న ఈసీ

Lok Sabha Elections 2019 : జన్ ధన్ ఖాతాల్లో బీజేపీ బ్లాక్ మనీ డిపాజిట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే... దానిపై ఈసీ దర్యాప్తు మొదలైంది.

news18-telugu
Updated: April 3, 2019, 6:57 AM IST
ఒక్కో జన్ ధన్ ఖాతాలో రూ.10,000... ఎలా వచ్చాయి... ఎవరు వేశారు? దర్యాప్తు చేస్తున్న ఈసీ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 3, 2019, 6:57 AM IST
మరో వారంలో లోక్ సభ ఎన్నికల తొలిదశ మొదలవ్వనుండగా... ఒక్కసారిగా కలకలం రేగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లాలోని ఓ బ్యాంకులో అనుమానాస్పద నగదు లావాదేవీలు జరిగాయి. దాదాపు 1700 జన్‌ధన్‌ బ్యాంకు అకౌంట్లలో కొన్నిరోజులుగా సుమారు రూ.10,000 చొప్పున రూ.1.7 కోట్లు వరకు జమ అయ్యాయి. దీనిపై ఒక్కసారిగా కలకలం రేగింది. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనీ, దేశంలోని అందరి జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లలో రూ.10000 చొప్పున డబ్బులు వేస్తోందన్న ప్రచారం మొదలైంది. ఐతే దీనిపై బీజేపీ ఎలాంటి అధికారిక ప్రకటనా చెయ్యలేదు. బీజేపీ నేతలు సైతం తాము అకౌంట్లలో డబ్బు వేస్తున్నట్లు ప్రకటనలేమీ చెయ్యలేదు. ఇదేదో ఎన్నికల తంతులా ఉందని, ఓటుకు నోటు ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.

నిఘా వర్గాలు, ఆదాయపన్ను (IT) శాఖ రంగంలోకి దిగాయి. బ్యాంక్ ప్రతినిధులే ఈ డబ్బు డిపాజిట్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ అంశంపై పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది బీజేపీ పనే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన బీజేపీ నేతలు... తమకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.

రంగంలోకి దిగిన ఈసీ : జన్ ధన్ ఖాతాల్లో డబ్బు డిపాజిట్‌పై అలర్ట్ అయిన ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. అసలేం జరగుతోంది అన్నదాన్ని పరిశీలిస్తోంది. ఎన్నికల సమయంలో ఓటర్లకు గాలం వేసేందుకు పార్టీల నేతలు డబ్బులిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎన్నికల కోడ్ నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధం. అయినా సరే పంపకాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున క్యాష్, బంగారు ఆభరణాలు, మద్యం, క్రికెట్ కిట్ల వంటివాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు వీలైనన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాయి.

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని 2014, ఆగస్టు 28న ప్రారంభించారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు అందించాలనే లక్ష్యంతో ఈ స్కీం తెచ్చారు. జీరో బ్యాలెన్స్‌తో దేశంలో కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఐతే... విదేశాల్లో నల్లధనాన్ని భారత్‌కి తెచ్చి... ప్రతి ఒక్కరి జన్ ధన్ అకౌంట్‌లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తానని 2014లో మోదీ హామీ ఇచ్చారనీ, ఆ హామీ నిలబెట్టుకోలేదని ఇప్పటికీ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటోంది. బీజేపీ నేతలు మాత్రం మోదీ అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని అంటున్నారు. ఆ క్రమంలో తాజాగా జరిగిన డిపాజిట్లపై సహజంగానే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి :

టాలీవుడ్‌ నటులను కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా... చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజమెంత?
Loading...
నారా లోకేష్ నకిలీ... జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఫ్యూచర్... రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్

రిటర్న్ గిఫ్టుకీ రూ.1000 కోట్లకీ సంబంధమేంటి... టీడీపీ నేతలు ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటే
First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...