Home /News /politics /

DUBBAKA RESULTS WILL BE REPEATED IN GHMC ELECTIONS BJP WILL WIN SAYS RAGHUNANDAN RAO SK

కేసీఆర్‌కు ఆనాడే మాటిచ్చా.. గ్రేటర్‌లోనూ దుబ్బాక ఫలితమే: రఘునందన్

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

2013లో టీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించినప్పుడు...కేసీఆర్‌కు ఒక మాట చెప్పానని గుర్తు చేశారు రఘునందన్ రావు. ఒక వజ్రాన్ని కోయాలంటే ఇంకో వజ్రంతో మాత్రమే సాధ్యమవుతుందని ఆనాడు చెప్పినట్లు ఆయన తెలిపారు.

    జీహెచ్ఎంసీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. షెడ్యూల్ విడుదల కాకముందే అన్ని పార్టీల నేతలు గ్రేటర్‌లో వాలిపోయారు. వ్యూహాలను సిద్ధం చేస్తూ .. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికల ప్రభావం వందకు వందశాతం.. హైదరాబాద్‌పై ఉంటుందని స్పష్టం చేశారు. దుబ్బాక ఫలితాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని వెల్లడించారు. గ్రేటర్‌పై కాషాయ జెండా ఎగరవేస్తాని ధీమావ్యక్తం చేశారు దుబ్బాక ఎమ్మెల్యే.

    ఇక ఉప ఎన్నిక సమయంలో తనపై పెట్టిన కేసులను న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని రఘునందన్ రావు అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడితే.. ఆలస్యమైనా విజయం దక్కుతుందని పేర్కొన్నారు. గ్రేటర్ పీఠంపై కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు దుబ్బాక ఎమ్మెల్యే. హైదరాబాద్ పరిధిలో పంచుతున్న రూ.10వేల వరద సాయం డబ్బులను.. ఎన్నికల కోసం పంపిణీ చేసిన డబ్బుగానే పరిగణిస్తున్నట్లు వెల్లడించారు రఘునందన్ రావు. టీఆర్ఎస్‌లో 30 నుంచి 40 మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని.. వారంతా బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. జీవితాంతం బీజేపీ కోసమే పనిచేస్తామని ఆయన అన్నారు.

    2013లో టీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించినప్పుడు...కేసీఆర్‌కు ఒక మాట చెప్పానని గుర్తు చేశారు రఘునందన్ రావు. ఒక వజ్రాన్ని కోయాలంటే ఇంకో వజ్రంతో మాత్రమే సాధ్యమవుతుందని ఆనాడు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆ మాటకు ఇప్పటికీ, ఎప్పటికీ కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. పదవులు ఉన్నా లేకపోయినా.. తనకున్న నల్లకోటు కేసీఆర్‌ను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతుందన్నారు. భగవంతుడి ఆశీర్వాదం, కార్యకర్తల బలం వల్లే.. కేసీఆర్ కూర్చున్న అసెంబ్లీకి తాను వెళ్తున్నానని ఆయన చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Hyderabad - GHMC Elections 2020, Raghunandan rao, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు