Dubbaka ByPolls: దుబ్బాకలో ఇప్పటి వరకు ఎంత డబ్బు, మద్యం దొరికిందంటే

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో భారీగా మద్యం, డబ్బు దొరుకుతోంది. పోలీసులు అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

news18-telugu
Updated: October 22, 2020, 5:56 PM IST
Dubbaka ByPolls: దుబ్బాకలో ఇప్పటి వరకు ఎంత డబ్బు, మద్యం దొరికిందంటే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో భారీగా మద్యం, డబ్బు దొరుకుతోంది. పోలీసులు అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులతో సమన్వయంతో కలసి ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు సిద్దిపేట పోలీస్ కమిషనర్, మెదక్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ డి. జోయల్ డేవిస్ తెలిపారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 315 పోలింగ్ కేంద్రాలు, వాటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు (89), సాధారణ పోలింగ్ కేంద్రాలు (226) ఉన్నాయి. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ కోసం 32 మొబైల్ పార్టీలు, 11 స్ట్రైకింగ్ ఫోర్స్ , 12 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నియమించినట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమాలు పాటించవలసిందేనని స్పష్టం చేశారు. కోవిడ్ 19 నిబంధనలు పాటించి‌, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్ బాటిల్ వెంబడి వుంచుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో చెక్ పోస్టుల వివరాలు

1. తోర్నాల గ్రామ శివారు, 2. శిలాజీనగర్ గ్రామ శివారు. 3. అక్బర్ పేట చౌరస్తా, 4. వెంకట్రావుపేట వాగుగడ్డ చౌరస్తా, 5. ఆరేపల్లి గ్రామశివారు, 6. అంకిరెడ్డి పల్లి గ్రామశివారు, 7. బోనాల కొండాపూర్ గ్రామశివారు, 8. చేగుంట గ్రామ శివారు, 9. కాసులపూర్ గ్రామ శివారు, 10. మెదక్ రోడ్ చేగుంట గ్రామ శివారు. అక్రమ రవాణా జరిగే డబ్బులు, మద్యం గురించి అడ్డుకట్ట వేయడానికి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సిద్దిపేట జిల్లా
1. ఈరోజు వరకు సిద్దిపేట జిల్లాలో రూ.13,86,000/- డబ్బులు సీజ్ చేశారు.
2. ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు 249.91 లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1,25,365/-
3. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ఈరోజు వరకు 124, కేసులు కేసులు నమోదుచేసి 1031 మందిని బైండోవర్ చేశారు.4. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారి పైన ఇప్పటి వరకు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మూడు కేసులు నమోదుచేసి వారిపై చర్యలు తీసుకున్నారు.

మెదక్ జిల్లా
1. ఈరోజు వరకు మెదక్ జిల్లాలో రూ.20,70,960/- డబ్బులు సీజ్ చేశారు.
2. ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 51.675 లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.24,160/-
3. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలో ఈరోజు వరకు 38 కేసులు కేసులు నమోదుచేసి 163 మందిని బైండోవర్ చేశారు.

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కానీ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటు వెయ్యమని ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా, డబ్బులు ఆశ చూపి ప్రలోభ పెట్టినా, మద్యం డబ్బులు ఓటర్లకు సరఫరా చేసినా, ఎలాంటి నేరపూరిత చర్యలకు దిగినా, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినా, అల్లర్లు, గొడవలకు పాల్పడిన వెంటనే గ్రామాల ప్రజలు యువకులు స్పందించి భారత ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టిన సీ-విజిల్ (CVIGIL) యాప్ మొబైల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదు చేయవచ్చు. సంబంధిత వీడియోలు, ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు.

ఎన్నికల నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే, ఎన్నికల సమయంలో ఏ చిన్న సంఘటన జరిగినా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల పోలీస్ నోడల్ అధికారి ఏసీపీ బాలాజీ, మొబైల్ నెంబర్ 7901640499, సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్, మొబైల్ నెంబర్ 9490617009, గజ్వేల్ ఏసీపీ నారాయణ, మొబైల్ నెంబర్ 8333998684, తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, మొబైల్ నెంబర్ 9490617008, కంట్రోల్ రూమ్ నెంబర్ 8333998699, డైల్ 100 కు ఫోన్ చేసి తెలిపినచొ అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు.

ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు ప్రజలు ప్రజా ప్రతినిధులు సహకరించాలని సూచించారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేయడానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినామని తెలిపారు. ప్రజలు యువకులు యువతులు ఓటు వేసేటప్పుడు ఓటు యొక్క విలువను గుర్తుంచుకొని ఓటు వేయాలని సూచించారు. ఎందరో మహానుభావుల త్యాగఫలం, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరించిందని గుర్తుంచుకొని మీకు నచ్చిన మెచ్చిన వ్యక్తులకు ఓటు వేయాలని సోషల్ మీడియా పై గట్టి నిఘా ఉంచామని, తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 22, 2020, 5:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading