news18-telugu
Updated: November 10, 2020, 10:15 AM IST
Dubbaka byPolls counting: దుబ్బాకలో పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ప్రారంభం అయ్యాయి. మొదటి మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి ఉంది. మొదటి రౌండ్లో బీజేపీ 341 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచింది. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి రఘునందన్ రావుకు 1135 ఓట్ల ఆధిక్యం లభించింది. మొదటి రౌండ్లో మొత్తం 7446 ఓట్లు వచ్చాయి. అందులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 3208 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి 2867 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 648 ఓట్లు లభించాయి. ఇక రెండో రౌండ్లో కూడా బీజేపీ దూకుడు కొనసాగింది.
రెండు రౌండ్లలో 14573 ఓట్ల లెక్కింపు పూర్తయింది. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 1135 ఓట్ల ఆధిక్యం లభించింది. రఘునందన్ రావుకు 6492 ఓట్లు వచ్చాయి. సోలిపేట సుజాతకు 5357 ఓట్లు లభించాయి. చెరుకు శ్రీనివాసరెడ్డికి 1315 ఓట్లు వచ్చాయి.
ఇక మూడో రౌండ్లో కూడా బీజేపీ ఆధిక్యం కనబరిచింది. మూడో రౌండ్లో బీజేపీకి 2,731 టీఆర్ఎస్ కి 2,067 ఓట్లు వచ్చాయి. దీంతో మూడో రౌండ్లో బీజేపీకి 124 ఓట్లు అత్యధికం లభించింది. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామంలో కూడా బీజేపీకి 110 ఓట్లు లీడ్ రావడం విశేషం.
14 టేబుళ్ల మీద 23 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతోంది. మొదటి మూడు రౌండ్లలో దుబ్బాక మండలానికి చెందిన ఈవీఎంలను లెక్కిస్తున్నారు. దుబ్బాక మండలంలోనే బీజేపీకి ఆధిక్యం రావడం టీఆర్ఎస్ శ్రేణులకు భారీ షాక్ గానే మారింది. దుబ్బాక మండలం పూర్తయిన తర్వాత మిరుదొడ్డి, తొగుట మండలాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు అన్నీ పట్టణ ప్రాంతాలకు సంబంధించినవి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎవరు గెలుస్తారనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతోంది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 10, 2020, 9:19 AM IST