దుబ్బాక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును ప్రస్తావించిన మంత్రి హరీశ్ రావు

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పేరును ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ బిల్లుపై ఆయన మండిపడ్డారు.

news18-telugu
Updated: September 21, 2020, 9:23 AM IST
దుబ్బాక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును ప్రస్తావించిన మంత్రి హరీశ్ రావు
హరీశ్‌రావు(ఫైల్ ఫొటో)
  • Share this:
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పేరును ప్రస్తావించారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ బిల్లుకు సంబంధించి బీజేపీపై విమర్శలు గుప్పించిన హరీశ్‌రావు.. ఇలా చేసినందుకే గతంలో చంద్రబాబును తెలంగాణ ప్రజలు తరిమికొట్టారని అన్నారు. ఆదివారం దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ బావులు, బోరు మోటార్లకు కరెంట్ మీటర్లు పెట్టాలనుకున్న చంద్రబాబుకే తెలంగాణ ప్రజలు మీటర్లు పెట్టి ఆంధ్రకు తరిమికొట్టారని.. దేశంలో వ్యవసాయానికి కరెంట్ మీటర్లు పెట్టాలనుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజలు అలాగే మీటర్లు పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. బీజేపీ విధానాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేశారంటే అవి ఎంత ప్రమాదకరమో ఆలోచించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లుల వల్ల రైతులకు ఆందోళన కలుగుతుందన్నారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇస్తూంటే.. మోదీ ప్రభుత్వం మాత్రం కరెంట్ మీటర్లు పెట్టి రైతుల నుంచి ముక్కుపిండి పైసల వసూలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఆఫ్రికా మొక్కజొన్నలకు అనుమతిస్తే.. ఇక్కడి రైతుల పరిస్థతి ఏం కావాలని ప్రశ్నించారు. ఇక, సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్ ప్రచార బాధ్యతలను చూసుకుంటున్నారు.
Published by: Sumanth Kanukula
First published: September 21, 2020, 9:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading