Home /News /politics /

DUBBAK BYPOLL EFFECT CONGRESS WORKERS PROTEST AGAINST UTTAM KUMAR REDDY SU

దుబ్బాక ఉప ఎన్నిక ఎఫెక్ట్.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్.. దిష్టిబొమ్మ దగ్దం

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. టీఆర్‌ఎస్, బీజేపీలు హోరాహోరిగా తలపడుతుంటే కాంగ్రెస్ మాత్రం చాలా వెనకబడి పోయింది.

    దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. టీఆర్‌ఎస్, బీజేపీలు హోరాహోరిగా తలపడుతుంటే కాంగ్రెస్ మాత్రం చాలా వెనకబడి పోయింది. మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కేవలం 22 వేల ఓట్లు మాత్రమే సాధించాడు. మొత్తం 23 రౌండ్‌లు కౌటింగ్ జరగగా.. ఒక్క రౌండ్‌లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి లీడ్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఘోర ఓటమికి సంబంధించి ఆ పార్టీ కార్యకర్తలు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసనకు దిగారు. కాజీపేట మండలం మడికొండలో ఉత్తమ్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. దుబ్బాక‌లో కాంగ్రెస్ ఓటమికి ఉత్తమ్ కుమార్‌ రెడ్డే కారణమని మండిపడుతున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు కాంగ్రెస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇక, దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం ఆ పార్టీ కీలక నేతలు రంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల తేదీ ఖరారు కాకముందు నుంచే తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు.. ఫలితాలపై స్పందించడానికి ముందుకు రావడం లేదు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు దుబ్బాకలో కాంగ్రెస్‌ దుస్థతికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చివరివరకు టీఆర్‌ఎస్ టికెట్ కోసం యత్నించిన శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడంపై స్థానిక నాయకులకు రుచించలేదని తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కూడా ఓటమికి కారణమనే చెప్పాలి.

    ఇక, దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ చివరి రౌండ్ వరకు హోరాహోరిగా సాగింది. ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Congress, Dubbaka By Elections 2020, Uttam Kumar Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు