గుంటూరులో డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు..

గుంటూరులో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న డ్రగ్స్ స్థావరంపై పోలీసులు దాడి చేశారు.

news18-telugu
Updated: December 1, 2019, 6:26 PM IST
గుంటూరులో డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరులో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న డ్రగ్స్ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ తయారుచేసే పరికరాలు,గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠా సభ్యులైన మహమ్మద్ షాద్,మహ్మద్ రఫత్‌, నాగూర్ షరీఫ్, వెంకటసూర్య, పాలెం అవినాశ్‌లను అరెస్ట్ చేశారు. వీరిలో షాద్ సౌత్ యెమెన్‌కి చెందినవాడు కాగా.. మహ్మద్ రఫత్ సిరియాకు
చెందినవాడు. మిగతా ఇద్దరిని గుంటూరు వాసులుగా గుర్తించారు.ఇక్కడ తయారుచేసే డ్రగ్స్‌ను విక్రయించేందుకు మరో ముగ్గురు సభ్యులు వీరితో కలిసి పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు జైల్లో ఉన్నారని చెప్పారు. డ్రగ్స్ వలలో చిక్కుకుని చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారని.. తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>