DOUBLE BEDROOM HOUSES SHCEME TO PRIVATE SCHOOL TEACHER MP KAVITA
ప్రైవేట్ స్కూళ్ల సిబ్బందికి డబుల్ బెడ్రూం ఇల్లు: ఎంపీ కవిత
ఎంపీ కవిత (ఫైల్ ఫోటో)
తెలంగాణ ఏర్పాటులో ప్రైవేట్ పాఠశాలలు కథానాయకుల పాత్ర పోషించాయని.. టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే హైలెవల్ కమిటీ వేసి ప్రైవేటు పాఠశాలల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే సిబ్బందిపై హామీల వర్షం కురిపించారు నిజామబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే సిబ్బందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే, తొలి ప్రాధాన్యతగా ప్రైవేటు స్కూళ్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరించేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా కలిసిరావాలని కవిత పిలుపునిచ్చారు. దేశంలోనే తొలిసారి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బలపర్చాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ప్రైవేట్ స్కూళ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న కవిత.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను అంతర్జాతీయ సంస్థలు అభినందిస్తున్నాయన్నారు. తెలంగాణలోకి ప్రతిపక్ష నేతలకు మాత్రం ఆ విషయం అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఊసరవెళ్లిలా రంగులు మార్చి.. మరోసారి తెలంగాణకు వస్తున్నచంద్రబాబును నమ్మొద్దని పిలుపునిచ్చారు.
Published by:Santhosh Kumar Pyata
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.