స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన నిర్ణయం...అద్వానీ బాటలోనే...

ఏప్రిల్ 16న సుమిత్రా మహాజన్‌కు 75 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలోనే ఆమెకు టికెట్ ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది.

news18-telugu
Updated: April 5, 2019, 4:06 PM IST
స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన నిర్ణయం...అద్వానీ బాటలోనే...
సుమిత్రా మహాజన్
  • Share this:
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకూడదని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఓ లేఖను సుమిత్రా మహాజన్ విడుదల చేశారు. ఇండోర్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ఎందుకు ప్రకటించడం లేదని బీజేపీ హైకమాండ్‌ను ఆమె ప్రశ్నించారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ఖరారుచేయాలని కోరారు. తాను మాత్రం ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడీ వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రోజుల క్రితం అద్వానీ సైతం లేఖరాసిన విషయం తెలిసిందే.

ఇండోర్ నుంచి మరోసారి ఎంపీ టికెట్‌ను ఆశించారు సుమిత్రా మహాజన్. కానీ ఇండోర్‌లో లోక్‌సభ అభ్యర్థి ఎంపికను పెండింగ్‌లో ఉంచింది బీజేపీ హైకమాండ్. ఏప్రిల్ 16న సుమిత్రా మహాజన్‌కు 75 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలోనే ఆమెకు టికెట్ ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది. పార్టీలో 75 ఏళ్లు దాటిన సీనియర్లకు టికెట్ ఇవ్వకూడదని బీజేపీ నిర్ణయించిన నేపథ్యంలో ఎల్‌కే అద్వానీ (91), మురళీ మనోహర్ జోషి (85) తరహాలోనే ఈమెకు కూడా టికెట్ కేటాయించలేదు.

ఇప్పటి వరకు ఇండోర్ లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించలేదు. పార్టీ పెద్దలకు కొన్ని అనుమానాలున్నాయి. వాటిపై పార్టీ సీనియర్లతో పలుమార్లు చర్చించాం. తుది నిర్ణయాన్ని వారికే వదిలేసాను. కానీ ఇప్పటి వరకు వాళ్లు సందిగ్ధంలోనే ఉన్నారని స్పష్టమైంది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయించుకున్నా.
సుమిత్రా మహాజన్, లోక్‌సభ స్పీకర్
ఇండోర్ నియోజకవర్గం నుంచి ఏకంగా 8 సార్లు విజయం సాధించారు సుమిత్రా మహాజన్. 1989 నుంచి ఇప్పటి వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐతే టికెట్ కోసం ఎప్పుడూ హైకమాండ్‌ని అడగలేదని ఆమె చెప్పారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతోందని ఇండోర్ అభ్యర్థిపై వీలైనంత త్వరగా నిర్ణయంతీసుకుంటే.. కార్యకర్తలు ప్రచారం మొదలు పెడతారని పార్టీ పెద్దలకు సూచించారు.

అద్వానీ, ఎంఎం జోషికి టికెట్ కేటాయించకపోవడంపై ఇటీవల పార్టీ అధ్యక్షుడు అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. 75 ఏళ్లు నిండిన నేతలకు టికెట్ ఇవ్వకూడని పార్టీ నిర్ణయించిందని..అందుకే టికెట్లు కేటాయించలేదని స్పష్టంచేశారు. గతంలో అద్వానీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుంచి ఈసారి అమిత్ షా బరిలోకి దిగుతున్నారు. కాగా, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం అద్వానీ ఓ లేఖను విడుదల చేశారు. బీజేపీని విమర్శించే వారంతా దేశద్రోహులు కారన్న ఆయన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. మోదీ, అమిత్ షాను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని, వారి పెత్తనంపై అద్వానీ అసంతృప్తి వ్యక్తంచేశారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

First published: April 5, 2019, 4:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading