అమరావతిపై కొడాలి నాని వ్యాఖ్యల దుమారం... మంత్రి బొత్స ఏమన్నారంటే

Amaravati: అమరావతి రాజధాని తరలింపుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై అమరావతి రైతులు భగ్గుమనగా... మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా స్పందించారు.

news18-telugu
Updated: September 9, 2020, 12:01 PM IST
అమరావతిపై కొడాలి నాని వ్యాఖ్యల దుమారం... మంత్రి బొత్స ఏమన్నారంటే
అమరావతిపై కొడాలి నాని వ్యాఖ్యల దుమారం... మంత్రి బొత్స ఏమన్నారంటే
  • Share this:
అమరవాతి శాసన రాజధాని అంశంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించ వద్దని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ అంశంపై ఆయన స్పందించారు. అన్ని వర్గాలకూ చెందిన ప్రాంతంగా రాజధాని ఉండాలనేదే కొడాలి నాని ఉద్దేశం అన్నారు బొత్స. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వవొద్దనడం కరెక్టు కాదనీ... కొంత మందే రాజధానిలో ఉండాలనుకోవడం సరి కాదనేది నాని అభిప్రాయం అని బొత్స వివరణ ఇచ్చారు. అది నాని అభిప్రాయం మాత్రమే అన్నారు. శాసన రాజధానిని అమరావతి నుంచి తప్పిస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు కదా అని బొత్స అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందన్న ఆయన... కొందరు కావాలనే ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు మంత్రి బొత్స.

కొడాలి నాని ఏమన్నారంటే:

ఏపీ రాజధానిగానే కాదు... ఏపీ శాసన రాజధానిగా కూడా అమరావతి వద్దని తాను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డితో చెప్పినట్లు మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. అసలే పరిపాలనా రాజధానిగా అమరావతి లేదని స్థానిక రైతులు ఆవేదన చెందుతుంట... తాజాగా కొడాలి నాని పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

భగ్గుమంటున్న రైతులు:
కొడాలి నాని ప్రకటనపై దళిత జేఏసీ సభ్యులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దండరాయునిపాలెంలో మంగళవారం నాని దిష్టిబొమ్మకు శవయాత్ర జరిపారు. మాట శుద్ధి లేని కొడాలి నానిపై జగన్‌ చర్యలు తీసుకోవాలని దళిత జేఏసీ కో-కన్వీనర్‌ పులి చిన్నా డిమాండ్‌ చేశారు. మూడు ముక్కల రాజధాని అని ప్రభుత్వం చెప్పే మాటలు అన్నీ ఒక బూటకం అని విమర్శించారు అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్. మూడు ముక్కల రాజధాని పేరుతో అన్ని శాఖలూ విశాఖకు తరలించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అందరూ కలిసి కుట్రలు పన్ని అమరావతిని ధ్వంసం చేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు చేస్తున్న ఉద్యమం బుధవారానికి 267వ రోజుకు చేరింది. తాజాగా పెదపరిమి, తుళ్లూరు, వెలగపూడి, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, ఐనవోలు, నేలపాడు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం గ్రామాల్లో రైతులు నిరసనలు కొనసాగించారు.
Published by: Krishna Kumar N
First published: September 9, 2020, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading