అమరావతిని చంపొద్దు ప్లీజ్.. చేతులు జోడించి వేడుకున్న లోకేష్

రెండు రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు కూడా ఇలాగే సీఎం జగన్‌కు దండం పెట్టారు. తనకు జగన్ మీద కోపం లేదని.. అమరావతిపై ఆలోచించాలని, తొందరపడవద్దని విజ్ఞప్తి చేశారు.


Updated: January 22, 2020, 9:01 PM IST
అమరావతిని చంపొద్దు ప్లీజ్.. చేతులు జోడించి వేడుకున్న లోకేష్
నారా లోకేష్
  • Share this:
బుధవారం ఏపీ శాసనమండలిలో ఆసక్తకిర పరిణామం చోటుచేసుకుంది. ''అమరావతిని చంపొద్దు, నరకొద్దు'' అంటూ నారా లోకేష్ సభను వేడుకున్నారు. రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి.. శాసన మండలికి విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల పసికందును చంపేసి తల ఒకచోట, మొండెం ఒక చోట, కాళ్లు మరోచోట పడేయవద్దని కోరారు. మూడు రాజధానులకు టీడీపీ పూర్తిగా వ్యతిరేకం అని స్పష్టం చేశారు లోకేష్. జై అమరావతి, జైజై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు కూడా ఇలాగే సీఎం జగన్‌కు దండం పెట్టారు. తనకు జగన్ మీద కోపం లేదని.. అమరావతిపై ఆలోచించాలని, తొందరపడవద్దని విజ్ఞప్తి చేశారు. నా కంటే చిన్నవాడైనప్పటికీ రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నానని అన్నారు. ఇవాళ మండలిలోనూ నారా లోకేష్ ఇలాగే చేతులెత్తి నమస్కారం పెట్టారు.

.

Published by: Shiva Kumar Addula
First published: January 22, 2020, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading