మా ఎమ్మెల్యేకి మళ్లీ టిక్కెట్ ఇవ్వొద్దు.. గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తల తీర్మానం

తాడేపల్లి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌కు టిక్కెట్ ఇస్తే ఓడిపోతారంటూ దళిత నాయకులు తీర్మానం చేశారు.

news18-telugu
Updated: February 27, 2019, 5:10 PM IST
మా ఎమ్మెల్యేకి మళ్లీ టిక్కెట్ ఇవ్వొద్దు.. గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తల తీర్మానం
తాడేపల్లి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ (File)
  • Share this:
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో టీడీపీలో వర్గ విబేధాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఈ సారి గుంటూరు జిల్లాలో విభేదాలు భగ్గుమన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌కు వ్యతిరేకంగా దళితులు సమావేశం అయ్యారు. పేరేచర్లలో జరిగిన ఈ భేటీకి పెద్ద ఎత్తున దళితులు హాజరయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద గెలిచిన శ్రావణ్ కుమార్‌కు మరోసారి టికెట్ ఇవ్వవద్దని వారంతా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అందించనున్నారు. శ్రావణ్ కుమార్‌కు టికెట్ ఇస్తే ఓడిపోతామని వారంతా చెబుతున్నారు. తాడేపల్లి ఎస్సీ నియోజకవర్గం. అక్కడ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌కు ఓ సామాజికవర్గానికి మధ్య వైరం నడుస్తున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టుల విషయంలో ఎమ్మెల్యే తమ మాట వినడం లేదని వారు ఆరోపిస్తుంటే, తాను అందరినీ కలుపుకొని పోతున్నారని ఎమ్మెల్యే చెబుతున్నారు. వారే తమ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని శ్రావణ్ కుమార్ వర్గం చెబుతోంది.

AP Assembly Elections 2019, TDP MLA Sravan Kumar, Tadepalli MLA Sravan Kumar, Dalit leaders resultation, Chandrababu Naidu, TDP MLA Candidates, TDP MLA Tickets, టీడీపీ ఎమ్మెల్యే టికెట్లు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, తాడేపల్లి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, శ్రావణ్ కుమార్‌కు వ్యతిరేకంగా దళితుల తీర్మానం
తాడేపల్లి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ (File)


తాడేపల్లి నియోజకవర్గం పరిధిలోనే రాజధాని అమరావతి నిర్మాణాలు ఉంటాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శ్రావణ్ కుమార్ విషయంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.

First published: February 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>