news18-telugu
Updated: August 1, 2019, 6:13 PM IST
ప్రియాంక గాంధీ (File)
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా... ఆ పార్టీ నేతలు, శ్రేణులకు ఓ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ తప్పుకోవడంతో ఆయన స్థానంలో ప్రియాంకా గాంధీకి పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రతిపాదించారు. అయితే, ఇలాంటి వాటిలోకి తనను లాగొద్దని ప్రియాంకా గాంధీ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 20న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఈ రోజు ప్రియాంకా గాంధీ వాద్రా నేతృత్వంలో నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలంటూ కొందరు ఆమె వద్ద ప్రస్తావించారు. అయితే, వెంటనే ఆమె ‘అందులోకి నన్ను లాగొద్దు’ అని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలో గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వారికి పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీ కోరుకున్నారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 1, 2019, 6:11 PM IST