ఆ విషయంలో ‘నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ’: జగన్

మేనిఫెస్టో విషయంలో ఇతర పార్టీలతో పోటీ లేదని జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. రెండు పేజీల్లో మేనిఫెస్టోను రూపొందించాలని సూచించారు.

news18-telugu
Updated: March 6, 2019, 3:49 PM IST
ఆ విషయంలో ‘నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ’: జగన్
వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: March 6, 2019, 3:49 PM IST
రాబోయే ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చే వాగ్ధానాల విషయంలో ఇతర పార్టీలతో తమకు పోటీ లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పోటీ పడి.. ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇవ్వడం కాకుండా, అమలు చేసే అంశాలనే నిజాయితీగా వాగ్దాదాలు ఇద్దామన్నారు. మేనిఫెస్టో విషయంలో ఇతర పార్టీలతో పోటీ లేదని తేల్చి చెప్పారు. రెండు పేజీల్లో మేనిఫెస్టోను రూపొందించాలని సూచించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలోని మేనిఫఎస్టో కమిటీకి పలు సూచనలు చేశారు. అందరికీ అర్థమయ్యే రీతిలో సూటిగా సంక్షిప్తంగా మేనిఫెస్టోలో పొందుపరచాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. ఆదర్శ రైతు చట్టం తీసుకొస్తామని, రైతులకు ప్రత్యేక బ్లూ కార్డులు ఇస్తామని చెప్పారు.

హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. కౌలు రైతులకు మేలు చేసేలా ఎలాంటి హామీలు ఇవ్వాలనే అంశంపై ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు జగన్ మోహన్ రెడ్డి. మరోవైపు ఏపీలో డేటా చోరీ అంశంపై గర్నర్ నరసింహన్‌ను కలవాలని వైసీపీ భావిస్తోంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలను కూడా మేనిఫెస్టోలో చేర్చారు. అలాగే, ఇప్పటి వరకు మేనిఫెస్టో కమిటీకి 300 అర్జీలు వచ్చాయి. భూ యజమానులకు నష్టం లేకుండా, కౌలు రైతులకు లబ్ధి చేకూర్చేలా ఓ ఫార్ములాను తయారుచేయాలని జగన్ సూచించారు. ఈనెల 12న విజయవాడలో మరోసారి మేనిఫెస్టో కమిటీ సమావేశం కానుంది.

First published: March 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...