కేసీఆర్ దండం పెడతా.. ఆంధ్రులను వదిలేయండి: పవన్ కళ్యాణ్

‘ కావాలంటే నేను, చంద్రబాబు, జగన్ ముగ్గురం పోటీ చేద్దాం. అంతే కానీ, ఛీకొట్టిన తెలంగాణ నాయకులను ఏపీకి తేవొద్దు.’ అని జగన్ మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సూచించారు.

news18-telugu
Updated: March 14, 2019, 7:49 PM IST
కేసీఆర్ దండం పెడతా.. ఆంధ్రులను వదిలేయండి: పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్, కేసీఆర్
news18-telugu
Updated: March 14, 2019, 7:49 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ రాజకీయాల్లో పార్టీల మధ్య విబేధాలు ఉంటాయని, మళ్లీ అందులో వేలు పట్టొద్దని పవన్ కళ్యాణ్ కోరారు. ‘కేసీఆర్ ఏపీ ఇప్పటికే దెబ్బతిన్న రాష్ట్రం. మళ్లీ అందులో వేలుపెట్టొద్దు. ఏవో చిన్నపాటి గొడవలు ఉంటాయి. మళ్లీ పాతగొడవలు లేపొద్దు. దయచేసి ఆంధ్రులను వదిలేయండి. మీకు దండంపెడతా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కంటే తనకు కేసీఆర్, మోదీ ఎక్కువ పరిచయం ఉందని, అయితే, వారికి తాను దూరం జరిగితే జగన్ మోహన్ రెడ్డి వెళ్లి వారితో స్నేహం చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు.

‘బీజేపీ మనల్ని బాగా దెబ్బకొట్టింది. మనం బీజేపీకి భుజం మోస్తే ఆ పార్టీ దొడ్డిదారిలో వైసీపీకి అండగా నిలుస్తోంది. బీజేపీతో స్నేహంపై వైసీపీ తన వైఖరి స్పష్టం చేయాలి. కేసీఆర్ నాకు కావాల్సిన వ్యక్తి. హరీశ్ రావు కూడా కావాల్సిన వ్యక్తి. అయితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను వారితో కలిసి లేను. కావాలంటే నేను, చంద్రబాబు, జగన్ ముగ్గురం పోటీ చేద్దాం. అంతే కానీ, ఛీకొట్టిన తెలంగాణ నాయకులను ఏపీకి తేవొద్దు. ఆంధ్రుల అభిమానం దెబ్బతీసిన వ్యక్తితో కలసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడగలరు?’ అని పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు మీద కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ‘పదే పదే మాటలు మార్చినందుకు చంద్రబాబునాయుడు పశ్చాత్తాపపడాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. స్వార్థం కోసం రాష్ట్రాన్ని బలిచేయొద్దు.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...