ప్రతి ఎంపీ అభిప్రాయమూ కీలకమే: ప్రధాని నరేంద్ర మోదీ

ఎలాంటి సంఘర్షణ లేకుండా, ప్రజాధనం వృథా కాకుండా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు.

news18-telugu
Updated: June 17, 2019, 11:31 AM IST
ప్రతి ఎంపీ అభిప్రాయమూ కీలకమే: ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ
  • Share this:
పార్లమెంటులోని ప్రతి ఎంపీ అభిప్రాయమూ కీలకమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ...పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. సంఖ్య తక్కువగా ఉన్నామని విపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో చురుకైన ప్రతిపక్షాల పాత్ర ఎంతో అవసరమన్న ప్రధాని నరేంద్ర మోదీ... ప్రతిపక్షాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతిపక్షాలు తమ గళాన్ని సభలో వినిపించవచ్చని, సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవచ్చని వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష నేతల ప్రతి మాట విలువైనదే అని ఆయన అన్నారు.అధికార, విపక్షాల మధ్య ఎలాంటి సంఘర్షణ లేకుండా, ప్రజాధనం వృథా కాకుండా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు.

చాలా దశాబ్ధాల తర్వాత ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ప్రజా శ్రేయస్సు కోసం తాము తీసుకునే నిర్ణయాలకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.First published: June 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading