హోమ్ /వార్తలు /రాజకీయం /

ఏపీ హోంమంత్రిపై అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు

ఏపీ హోంమంత్రిపై అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంమంత్రి మేకతోటి సుచరిత

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంమంత్రి మేకతోటి సుచరిత

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరితపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీజీపీ దగ్గర స్టాంప్‌గా పనిచేయవద్దంటూ వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరితపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీజీపీ దగ్గర స్టాంప్‌గా పనిచేయవద్దంటూ వ్యాఖ్యానించారు. నర్సీపట్నంలో విలేకరులకు పంపిన వీడియోలో మాజీ మంత్రి అయ్యన్న హోంమంత్రిని ఉద్దేశించి పలు కామెంట్లు చేశారు. ‘ఎస్సీల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కేసులు నమోదు చేయడం రాష్ట్రంలోనే విడ్డూరంగా ఉంది. అక్కడ ఎస్పీ ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే దీనిపై ఎఫ్ఐఆర్ వేసిన ఎస్ఐ, సీఐలను వదిలేసి కిందస్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణం. ఒక మహిళ హోం మినిష్టర్ అయినందుకు మనం గర్వపడ్డాం. హోం మినిష్టర్ కు ఉన్నటువంటి అధికారాలు ఆమెకు తెలియదు. రాష్ట్రంలో దళితుల మీద వందల్లో దాడులు జరుగుతున్నా, అదే వర్గానికి చెందిన మంత్రి అయిన మన హోం మంత్రి స్పందన తీరు హాస్యాస్పదంగా ఉంది. చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. ఆమె గెలిచిన ఏరియా అయినటువంటి అమరావతిలో మహిళలు ఆందోళన చేస్తుంటే ఇప్పటికి పట్టించుకున్న దాఖలాలు లేవు.’ అని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

అసలు దిశ చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్ ప్రారంభించారని అయ్యన్న అన్నారు. దీనిపై ఎటువంటి జీవో లేకున్నా దిశ పోలీస్ స్టేషన్ సీఎం ప్రారంభించారంటే అంతకన్నా మూర్ఝత్వం మరొకటి ఉండదన్నారు. గంజాయి వ్యాపారానికి స్థానిక రాజకీయ నాయకులు సపోర్టు చేస్తున్నారని, నాటుసారా, గంజాయి చాలా సమస్యగా మారాయని అయ్యన్నపాత్రుడు చెప్పారు. ‘గంజాయి వ్యాపారానికి సంబంధించి పోలీసు, ఎక్సైజ్ శాఖల వద్ద రికార్డు ఉంది. 20 సంవత్సరాల నుంచి ఎవరు చేస్తున్నారో ప్రెస్ కు చెప్పి, వారిపై చర్యలు తీసుకోండి.’ అని అయ్యన్న కోరారు.


వారం రోజుల క్రితం అమరావతిలోని కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన 11 మంది రైతులపై మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. మూడు రాజధానులు, 30 లక్షల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారని రాజధానిలో దీక్ష చేపట్టేందుకు ఆటోలలో వస్తున్న వ్యక్తులను సదరు రైతులు కృష్ణాయపాలెం వద్ద అడ్డుకున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు? ఎందుకు వస్తున్నారని నిలదీశారు. బయటి ఊరి వాళ్లకు రాజధాని గ్రామాల్లో పని ఏంటని ప్రశ్నించారు. అమరావతి రైతులు ఆటోల్లో వస్తున్న వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఆటోల్లో ఉన్నవారు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో బాధితులు ఫిర్యాదు చేయడంతో రైతుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే, దళితుల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఫిర్యాదు చేసిన వారు కేసు విత్ డ్రా చేసుకున్నా పోలీసులు కేసు కొట్టేయడానికి నిరాకరించారు. కేసుపెట్టిన 24 గంటలు కాకముందే పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా హడావుడిగా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ఎస్సీ నేతలు, టీడీపీ నేతలు పోలీసుల్ని ప్రశ్నించారు. దీంతో పాటు రైతులకు సంకెళ్లు వేసి తరలించడం కూడా తీవ్ర దుమారం రేపింది.

First published:

Tags: Andhra Pradesh, AP DGP, Gautam Sawang, Mekathoti sucharitha

ఉత్తమ కథలు