DO YOU KNOW HOW MANY VOTES IN TELANGANA LOK SABHA ELECTIONS SK
తెలంగాణలో జనసేనకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా?
పవన్ కళ్యాణ్,
అంతగా ఊపున్న ఏపీలోనే ఘోరంగా ఓడిపోయిన జనసేన...ఇక తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. పోటీ చేసిన చోట ఎక్కడా రెండు శాతానికి మించి ఓట్లు రాలేదు. కొన్ని చోట్ల నోటా కంటే తక్కువ ఓట్లుపడ్డాయి.
ఎన్నో అంచనాల మధ్య ఏపీ ఎన్నికల బరిలో దిగిన జనసేన చిత్తు చిత్తుగా ఓడింది. కనీసం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా గెలవలేకపోయారు. భీమవరం, గాజువాక రెండింటిలోనూ పరాజయం పాలయ్యారు. ఏపీలో కింగ్ మేకర్ అవుదామనుకున్న జనసేనకు ఒకే ఒక్క సీటు మిగిలింది. రాజోలు స్థానంలో రాపాక వరప్రసాద్ మాత్రమే జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీలో అట్టర్ ఫ్లాపైన జనసేన..మరి తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసా..?
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో దింపారు పవన్ కళ్యాన్. మొత్తం 17 ఎంపీ సీట్లలో ఆరు స్థానాల్లో జనసేన నేతలు పోటీచేశారు. తెలంగాణలో హైదరాబాద్ స్థానాన్ని మినహాయిస్తే మిగిలిన సీట్లలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. అంతగా ఊపున్న ఏపీలోనే ఘోరంగా ఓడిపోయిన జనసేన...ఇక తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. పోటీ చేసిన చోట ఎక్కడా రెండు శాతానికి మించి ఓట్లు రాలేదు. కొన్ని చోట్ల నోటా కంటే తక్కువ ఓట్లుపడ్డాయి. మల్కాజ్ గిరిలో ఆ పార్టీకి 1.82 శాతం ఓట్లుపడ్డాయి. తెలంగాణలో జనసేనకు ఇదే అత్యధికం.
తెలంగాణలో జనసేనకు పడ్డ ఓట్ల వివరాలు
లోక్సభ
అభ్యర్థి
ఓట్లు
స్థానం
విన్నర్
మల్కాజ్గిరి
మహేందర్ రెడ్డి
28420
4
రేవంత్ రెడ్డి
ఖమ్మం
నారాల సత్యనారాయణ
19,304
5
నామా నాగేశ్వరరావు
సికింద్రాబాద్
శంకర్ గౌడ్
9,683
4
కిషన్ రెడ్డి
ఆదిలాబాద్
నరేంద్రనాయక్
5,241
8
సోయం బాపురావు
మహబూబాబాద్
భాస్కర్ నాయక్
9,811
9
మాలోత్ కవిత
నిజామాబాద్
బత్నాతె శంకర్
2,023
13
ధర్మపురి అరవింద్
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.