మంగళగిరిలో ఇల్లు కొనేముందు ఆలోచించండి... వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి సహా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అక్రమంగా అనేక లే ఔట్లు వేసి వెంచర్లు చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. ఇందులో విలాసవంతమైన విల్లాలు కట్టి ఒక్కోడాన్ని 5 కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు.
news18-telugu
Updated: July 6, 2019, 12:38 PM IST

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
- News18 Telugu
- Last Updated: July 6, 2019, 12:38 PM IST
గత ఐదేళ్లలో మంగళగిరి నియోజకవర్గం పరిధిలో జరిగిన భూ బాగోతాలపై విజిలెన్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరతానని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలెవరూ మంగళగిరి నియోజకవర్గంలో నిర్దిష్ట సమాచారం లేకుండా అపార్టుమెంట్లు కానీ స్థలాలు కానీ కొనవద్దని ఆయన కోరారు. సామాన్యులు అప్పులు తెచ్చుకుని కొనుక్కుని ,తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లింగమనేని రమేశ్,ఐజేయం అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. మంగళగిరి సహా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అక్రమంగా అనేక లే ఔట్లు వేసి వెంచర్లు చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. ఇందులో విలాసవంతమైన విల్లాలు కట్టి ఒక్కోడాన్ని 5 కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు.
బిల్డింగ్ పర్మిట్, లే ఔట్ ఫీజు కాజా గ్రామానికి కట్టాల్సి ఉన్నా ఇప్పటిదాకా కట్టలేదని అన్నారు. సుమారు రూ.40 నుండి రూ. 50 కోట్లు పంచాయితీకి రావాల్సిన ఫీజు ఎగ్గొట్టారని ఆరోపించారు. పంచాయితీకి రావాల్సిన ఫీజు ఎగ్గొట్టడమే కాకుండా ఆ పంచాయితీ మీదే కేస్ వేశారని, ఆ కేసులు బెంచ్‌పైకి రాకుండా మేనేజ్ చేశారని అన్నారు. కరకట్ట ఇల్లు ఇచ్చారు కాబట్టే లింగమనేని రమేశ్ అక్రమాలను మాజీ సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు. విల్లాలు కొనుక్కున్న వాళ్లు ఈ విషయం తెలియకుండా కొనుక్కున్నారని ఆర్కే.. సమస్యలు వస్తే వాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.

కొత్తగా కట్టిన టీడీపీ ఆఫీస్ కూల్చేయాలని హైకోర్టులో పిటిషన్
మంగళగిరి ఎమ్మెల్యే ఆఫీస్‌లో చోరీ... పోలీసులకు ఫిర్యాదు
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఇంటి ఎదుట మహిళల ధర్నా..
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం... ఐదేళ్ల జీతం దానం...
చంద్రబాబు, లోకేశ్ ఇంటి అద్దె ఇచ్చారా ? లింగమనేనికి వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్
మంగళగిరిలో అమరావతి... వైసీపీ ఎమ్మెల్యే సరికొత్త వాదన
Loading...