ఆ బిల్లులను ఆమోదించొద్దు.. అవసరమైతే.. గవర్నర్‌కు యనమల లేఖ

పరిపాలన వికేంద్రీకరణ బిల్లును పరిశీలించి అనుమతి కోసం భారత రాష్ట్రపతికి పంపాలని టీడీపీ సీనియర్ నేత యనమల ఏపీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: July 17, 2020, 7:51 PM IST
ఆ బిల్లులను ఆమోదించొద్దు.. అవసరమైతే.. గవర్నర్‌కు యనమల లేఖ
యనమల రామకృష్ణుడు(File)
  • Share this:
పరిపాలన వికేంద్రీకరణ, ఏపీ సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ప్రజాప్రయోజనాల ప్రాతిపదికగా పరిశీలించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ గవర్నర్‌కు లేఖ రాశారు. రాజ్యాంగ ప్రకారం సంఘర్షణకు దారి తీసే చర్యలను ఆమోదించొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో కోరారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అనుసరించటం ద్వారా ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు ఆమోదంపై అవసరమైతే భారత అటార్నీ జనరల్ అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.

ఈ బిల్లులను గవర్నర్‌గా పరిశీలించి అనుమతి కోసం భారత రాష్ట్రపతికి పంపాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెండు బిల్లులను 2014లో పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఒకే రాజధాని నగరం అనే అర్థం ఉందని.. ఏపీ రాజధాని అమరావతిని కొనసాగించాలని హైకోర్టులో అనేక వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని లేఖలో యనమల పేర్కొన్నారు. ఈ బిల్లులను ఒకసారి సెలెక్ట్ కమిటీకి పంపిన తర్వాత రెండోసారి బిల్లులను శాసనమండలి పరిగణనలోకి తీసుకోలేదని గుర్తు చేశారు. ఈ బిల్లులను శాసనమండలి తిరస్కరించలేదని లేఖలో ప్రస్తావించారు. సెలెక్ట్ కమిటీకి పంపిందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
Published by: Kishore Akkaladevi
First published: July 17, 2020, 7:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading