Home /News /politics /

DMK SENIOR LEADER DURAI MURUGAN MEETS AP CM CHANDRABABU IN AMARAVATHI SK

చంద్రబాబుతో డీఎంకే చర్చలు...కేసీఆర్ గురించే మాట్లాడారా..?

చంద్రబాబుతో స్టాలిన్ (ఫైల్ ఫొటో)

చంద్రబాబుతో స్టాలిన్ (ఫైల్ ఫొటో)

తాను బీజేపీ వ్యతిరేకపక్షాల వెంటే ఉన్నానని, మీరు కూడా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కోరేందుకే డీఎంకే నేతను స్టాలిన్ అమరావతికి పంపించినట్లు సమాచారం. ఐతే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్‌కు ఈ పరిణామాలు మింగుడుపడడం లేదు.

    తెలుగు రాష్ట్రాల సీఎంలు జాతీయ రాజకీయాలపై సీరియస్‌గా దృష్టిసారించారు. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకతాటిపైకి తెస్తున్నారు. అటు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో కేసీఆర్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం చెన్నైవెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశయ్యారు. ఐతే ఆ మరుసటి రోజే డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్‌ అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. ఏపీసీఎం చంద్రబాబునాయుడిని కలిసి చర్చలు జరిపారు.

    అమరావతికి వెళ్లిన దురై మురుగన్ చంద్రబాబు నాయుడితో సమావేశమై జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్టాలిన్‌తో భేటీ జరిగిన మరుసటి రోజే టీడీపీతో డీఎంకే చర్చలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న కేసీఆర్-స్టాలిన్ భేటీలోనూ దురై ముురుగన్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి భేటీకి సంబంధించిన అంశాలను చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చర్చల సారాంశాన్ని సవివరంగా ఆయనకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chandrababu naidu, CM KCR, DMK, Kcr, Lok Sabha Election 2019, MK Stalin, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు