DMK Manifesto: రాజీవ్ గాంధీ హంతకులకు విముక్తి...డీఎంకే మేనిఫెస్టోలో హామీ

DMK Manifesto | తమిళనాడులోని జైళ్లలో మగ్గుతున్న ఏడుగురు రాజీవ్ గాంధీ హంతకులకు విముక్తి కల్పించనున్నట్లు లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే హామీ ఇచ్చింది. అలాగే తమిళనాడులో ఉంటున్న శ్రీలంక శరణార్థులకు భారత పౌరసత్వం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

news18-telugu
Updated: March 29, 2019, 9:23 PM IST
DMK Manifesto: రాజీవ్ గాంధీ హంతకులకు విముక్తి...డీఎంకే మేనిఫెస్టోలో హామీ
డీఎంకే మేనిఫెస్టోను విడుదల చేసిన ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్
  • Share this:
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే ఆసక్తికరమైన హామీలు ఇచ్చింది. విద్యార్థులు, మహిళలు, రైతులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, శ్రామి వర్గాలు ఇలా అన్ని వర్గాలను ఆకర్షించేలా మేనిఫెస్టోలో పలు హామీలను గుప్పించారు.  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలి జైళ్లలో మగ్గుతున్న ఏడుగురికి విముక్తి కల్పించనున్నట్లు కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అలాగే తమిళనాడులో తలదాచుకుంటున్న శ్రీలంక శరణార్ధులకు పౌరసత్వం కల్పించనున్నట్లు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అలాగే మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షతో తమిళ విద్యార్థులకు నష్టం జరుగుతోందని, తాము అధికారంలోకి వస్తే నీట్ పరీక్షను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యా రుణాలను మాఫీచేయనున్నట్లు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అలాగే పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఉచిత రైల్వే పాసులు కల్పించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో తమిళ భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించనున్నట్లు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అలాగే చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు ప్రత్యేక బడ్జెట్, తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో సెక్యూరిటీ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సేతు సముద్ర పథకాన్ని పున:ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

జాతి వ్యతిరేక, హిందూ వ్యతిరేక మేనిఫెస్టో: సుబ్రహ్మణ్య స్వామి

డీఎంకే మేనిఫెస్టో జాతి వ్యతిరేకమైనదిగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విరుచుకపడ్డారు. రాజీవ్ గాంధీ హంతకులకు విముక్తి కల్పిస్తామని ఎన్నికల మేనిఫోస్టోలో పెట్టడం సరికాదన్నారు. దీనిపై డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ స్పందించాలని డిమాండ్ చేశారు. దీనికి కంటే మించిన జాతి వ్యతిరేక, హిందూ వ్యతిరేక మేనిఫెస్టో మరొకటి ఉండబోదని స్వామి మండిపడ్డారు.
First published: March 19, 2019, 1:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading