New NEP 2020 | ‘విద్యా సంస్కరణల ముసుగులో ద్రావిడ వ్యతిరేక కుట్ర’

National Education Policy 2020 | కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొస్తున్న విద్యా సంస్కరణలను తమ పార్టీ అంగీకరించే ప్రసక్తే లేని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు. దీనికి వ్యతిరేకంగా భావ సారూప్య పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి జాతీయ స్థాయి ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. 

news18-telugu
Updated: August 1, 2020, 5:23 PM IST
New NEP 2020 | ‘విద్యా సంస్కరణల ముసుగులో ద్రావిడ వ్యతిరేక కుట్ర’
ఎంకే స్టాలిన్ (PTI)
  • Share this:
కేంద్ర కేబినెట్ రెండ్రోజుల క్రితం ఆమోదించిన జాతీయ విద్యా విధానాన్ని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కొత్త విద్యా విధానంతో  ద్రావిడులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ కేంద్రంపై ఆయన సంచనల ఆరోపణలు చేశారు. దేశంలోని అందరు ప్రజలపై బలవంతంగా హిందీ, సంస్కృత భాషలను రద్దేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. విద్యా సంస్కరణల ముసుగులో మరుగైపోతున్న మనుచరిత్రను మళ్లీ అమలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా రుద్దే కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డీఎంకే పోరాటం చేస్తుందని పార్టీ శ్రేణులనుద్దేశించి రాసిన ఓ బహిరంగ లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొస్తున్న విద్యా సంస్కరణలను తమ పార్టీ అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. దీనికి వ్యతిరేకంగా భావ సారూప్య పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి జాతీయ స్థాయి ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడున్న 10+2 విధానం విజయవంతమైందని...దీని స్థానంలో 5+3+3+4 విధానాన్ని తీసుకురావడం అర్థరహితమని అభిప్రాయపడ్డారు. పిల్లల మనస్సులో విష భీజాలు నాటే ఉద్దేశంతోనే కొత్త విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారని అనుమానాలు వ్యక్తంచేశారు.

విద్యా వ్యవస్థపై రాష్ట్రాలకే పూర్తి అధికారాలు ఉన్నాయని, అయితే దీన్ని తన చొప్పుచేతుల్లోకి తీసుకుని, పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని కేంద్రం కుయుక్తులు పన్నుతోందని స్టాలిన్ ఆరోపించారు. ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో రాజకీయ నేతల గృహనిర్భందాన్ని ప్రస్తావించిన స్టాలిన్...దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ధ్వజమెత్తారు.
Published by: Janardhan V
First published: August 1, 2020, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading