వేలూరులో డీఎంకే అభ్యర్థి గెలుపు... హోరాహోరీ పోరు

తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్ విజయం సాధించారు.

news18-telugu
Updated: August 9, 2019, 3:30 PM IST
వేలూరులో డీఎంకే అభ్యర్థి గెలుపు... హోరాహోరీ పోరు
డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్
  • Share this:
వేలూరు లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్ విజయం సాధించారు. ఆగస్టు 5 జరిగిన ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి తరపున షణ్ముగం పోటీ చేయగా... డీఎంకే తరపున కతిర్ ఆనంద్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికను అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నిక హోరా హోరీగా సాగింది. ఓట్ల లెక్కింపులోనూ ఇదే రకమైన ఉత్కంఠ కొనసాగింది. డీఎంకే ఆధిపత్యం సాధిస్తుందని భావించిన ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి గట్టి పోటీ ఇచ్చింది. దీంతో తుది రౌండ్ వరకు ఫలితం తేలలేదు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి షణ్ముగంపై డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్ 8,460 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 10,24,352 ఓట్లు పోలయ్యాయి. డీఎంకే అభ్యర్థికి 4,78,855 ఓట్లు రాగా, అన్నాడీఎంకే అభ్యర్థికి 4,70,395 ఓట్లు వచ్చాయి. డీఎంకే తరపున విజయం సాధించిన కతిర్ ఆనంద్ తండ్రి, డీఎంకే కోశాధికారి దురై మురుగన్ నివాసంలో జరిగిన ఐటీ సోదాల్లో భారీగా డబ్బు దొరికింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఒక నియోజకవర్గం మొత్తంగా ఎన్నికను వాయిదా వేయడం చరిత్రలో ఇదే ప్రథమం.


First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు