DK SHIVAKUMAR ON TRUST VOTE DEFEAT IN KARNATAKA ASSEMBLY MK
ఓడిపోతే ఏమవుతుంది...రాత్రికి రెండు పెగ్గులేసి పడుకుంటాం..డీకే శివకుమార్ కుమార్ వేదాంతం....
డీకె శివకుమార్ (ఫైల్ ఫోటో)
ఓడిపోతే ఎమవుతుంది... మహా అయితే...రాత్రికి రెండు పెగ్గులు అదనంగా తీసుకుని బాధ మరిచిపోతామని అన్నారు. అంతేకాదు డీకే. శివకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. తాను ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా ఆపలేకతున్నానని భావిస్తున్నారా అని శివకుమార్ ఎద్దేవా చేశారు.
విశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ మంత్రి డీకే.శివకుమార్ శాయశక్తులా మంత్రాంగం నడిపినప్పటికీ, ఆయన పాచికలు పారలేదు. దీంతో ఆయన వేదాంత ధోరణిలోకి వెళ్లిపోయారు. బీజేపీ తీరును ఆయన తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. అధికార దాహం తగదని, అందరం ఏదో ఒక రోజు తనువు చాలించాల్సిన వారమేనని అన్నారు. అంతేకాదు తనను వెన్నుపోటు పొడిచి బీజేపీ పంచన చేరిన తన స్నేహితులు రేపు వారిని కూడా వెన్ను పోటు పొడవటం ఖాయమని అన్నారు. ఓడిపోతే ఎమవుతుంది... మహా అయితే...రాత్రికి రెండు పెగ్గులు అదనంగా తీసుకుని బాధ మరిచిపోతామని అన్నారు. అంతేకాదు డీకే. శివకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. తాను ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా ఆపలేకతున్నానని భావిస్తున్నారా.. ప్రస్తుతం మీ పక్కన చేరిన ఎంటీబీ నాగరాజుకు టికెట్ ఇప్పించిందే నేనే. ఆ విషయం మర్చిపోకండి’ అంటూ ఎద్దేవా చేశారు.
అంతేకాదు డీకే. శివకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. తాను ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా ఆపలేకతున్నానని భావిస్తున్నారా.. ప్రస్తుతం రెబెల్‌గా ఉన్న ఎంటీబీ నాగరాజుకు టికెట్ ఇప్పించిందే తానేనని, ఆ విషయం మర్చిపోకండి అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు రెబెల్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు తమను కలవాల్సిందిగా తనను కోరారని, అయితే తాను, కుమార స్వామి ముంబై వెళ్దామని భావించాం. కానీ అధికారులు సీఎం ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదన్నారు. దాంతో తానొక్కడినే ముంబై వెళ్లానని. రెబెల్ ఎమ్మెల్యేలున్న హోటల్లోనే ఓ గది బుక్ చేసినా, హోటల్లోకి పోలీసులు అనుమతించకుండా కుట్ర చేశారని వాపోయారు. అయితే తనను కలుస్తామన్న ఎమ్మెల్యేలు తన మీద కేసు పెట్టారని పోలీసులు వాపోయారు. ఇదంతా చూసి నేను షాక్ గురైనట్లు తెలిపారు. ‘ఈ ఎమ్మెల్యేలంతా లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా నాతో కలిసి పని చేశారు. నా అడుగుజాడల్లోనే నడుస్తామన్నారు. కానీ చివరకిలా చేశారని వాపోయారు శివకుమార్.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.